గుండెపోటు, పక్షవాతం వంటి మాటలు వింటేనే చాలా మంది గుండె గుభేల్‌మంటుంది. ఎందుకంటే క్షణాల్లో ప్రాణాలు తీసేది ఒకటైతే, ఎందుకూ పనికి రాకుండా చేసేది మరొకటి. అందుకే వాటి పేరెత్తితేనే అంత భయం. కాకపోతే రోజుకు ఒక గుడ్డు తినడం ద్వారా ఈ రెండు సమస్యలకూ చెక్‌ పెట్టవచ్చునంటున్నారు పరిశోధకులు.

Image result for egg

గుడ్డు అనగానే 'అమ్మో కొలెస్ట్రాల్‌' అంటూ చాలామంది వణికిపోతారు. కానీ, శరీర పోషణకు ఒక పరిమిత మోతాదులో మంచి కొలెస్ట్రాల్‌ కూడా అవసరమేననేది వాస్తవం. కొలెస్ట్రాల్‌తో పాటు గుండె పనితీరుకు తోడ్పడే విటమిన్లు, లవణాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. వీటికితోడు జీవక్రియలకు అవసరమయ్యే ప్రొటీన్‌తో పాటు, 9 రకాల అమినో యాసిడ్స్‌ కూడా ఉంటాయి.

Image result for egg

వారానికి ఐదు కోడిగుడ్లు తీసుకుంటే..?
కోడిగుడ్లను వారానికి ఐదు సార్లు తీసుకుంటే గుండె జబ్బుల ముప్పు 12 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని.. పెకింగ్ యూనివర్శిటీ హెల్త్ సైన్స్ సెంటర్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. 30 నుంచి 79 సంవత్సరాల మధ్య ఆరోగ్యవంతులైన నాలుగు లక్షల మంది ఆహారపు అలవాట్లను పరిశోధకులు పరిశీలించారు.

Image result for egg eating

ఈ పరిశోధనలో రోజూ కోడిగుడ్డు తినేవారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలాగే గుడ్డు తినని వారి కంటే తినేవారిలో గుండెపోటు ముప్పు కూడా 26 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేగాకుండా గుండె జబ్బుల ద్వారా మరణించే అవకాశం 18 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: