అందమైన తలకట్టు, ఇవన్నీ ఉన్నా చర్మం ఎండిపోయి, ముడతలుపడి కళాహీనంగా ఉంటే అది సంపూర్ణ సౌందర్యం అనిపించుకోదు. పుష్టికరమైన శరీరం, నిగనిగలాడే పట్టులాంటి చర్మంవల్ల సమకూరే సొగసులు అందరినీ కట్టిపడేస్తాయి. అది లేనప్పుడు ఎన్ని క్రీములు రాసుకున్నా మేకప్ వేసుకున్నా ఉపయోగం ఉండదు. మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే అటు ఆరోగ్యం అందం సమకూరుతాయ. చర్మ వ్యాధులను నివారించడంలో కొన్ని పోషకాలు ఉపకరిస్తాయి.
Image result for womens exercise
సమతులాహారం వల్ల మచ్చలు, పుండ్లు, ఇతర చర్మవ్యాధఉలు కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి. చర్మం కళాహీనంగా మారిపోతుందని గమనించి పౌష్టికాహారం తీసుకోవడం మొదలు పెట్టినా శరీరం వాటిని గ్రహించి ఫలితాలివ్వడానికి చాలా కాలం పడుతుంది. అందుకే ముందు మంచీ జాగ్రత్త పడటం తప్పనిసరి, చర్మం ఎదుర్కొనే ప్రతి సమస్యకూ ఆహారం చక్కని పరిష్కారం తీసుకోక తప్పదు.
Image result for womens exercise food
డాల్డా ఉపయోగించి తయారు చేసేవి, కుకీల్లాంటి బేకరీల్లో లభించే స్నాక్స్, నూనెలో వేయించే చిప్స్ వంటి చిరుతిళ్లను తినకపోవబం చాలా శ్రేయస్కరం. తినే తిండిలో పీచు లేకపోయినా ఇబ్బందే, శరీరానికి అవసరమైన పీచు లేకపోతే మలవిసర్జన సక్రమంగా జరగక విషపధార్థాలు పేరుకుపోయి. శరీరంలో ప్రతికూల పరిణామాలకు కారణమౌతాయి. అదే క్రమంలో చర్మానికి నష్టం తప్పదు.

కాలేయం సరిగ్గా పనిచేయకపోయినా ఇబ్బదే, ఇటువంటప్పుడు మలినాలను విసర్జించే భారం చర్మంపై పడి అది కాస్తా పటుత్వాన్ని బిగువును కోల్పోతుంది. పోషకాలుండే ఆహారాన్ని తీసుకుంటూ సక్రమంగా నిద్రపోతూ వ్యాయామం చేస్తే విస్తృత ప్రయోజనాలు లభిస్తాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: