ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటంచండి బాదం పప్పులో బ్లీచింగ్ కారకాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మంలో మృత కణాలు తొలగిస్తాయి. బాదం పలుకులు రాత్రంతా నానపెట్టి మరునాడు తేనె, ఆలివ్ నూనె కలిపి ఓవెన్ లో 20 నిమిషాలు ఉంచాక, ముఖానికి మాస్కు లా వేయాలి. 15 నిమిషాలు గోరువెచ్చని నీటితో శుభ్రపరిస్తే ముఖం కాంతులీనుతుంది. రెండు చెంచాల బాదం పొడికి చెంచా ఓట్ మీల్, యాపిల్ రసం, ఆలీవ్వ్ నూనె అరచెంచా చొప్పున కలపాలి. ఆ మిశ్రమాన్ని మునివేళ్ళతో తీసుకుని ముఖం, మెడమీద వలయాకారంలో మర్థన చేసి అరగంట ఉంచి వెచ్చని నీటితో కడిగితే చర్మం తాజాగా ఉంటుంది. నానపెట్టి రుబ్బినబాదం మిశ్రమాన్కి పిజ్జాలో ఉపయోగించే మైనేజ్ అరకప్పు కలపాలి. దీన్ని పట్టించడానికి ముందు ముఖాన్ని వెనిగర్ తో శుభ్రపరచాలి.  చర్మానికి బాదం మిశ్రమం మర్థన చేసిన పావుగంట తర్వాత వెనిగర్తో శుభ్రపరచాలి. ముఖం మీద జిడ్డు, మృతకణాలు పూర్తిగా తొలగిపోతాయి. బాదం పొడికి పచ్చిపాలు కలిపి ముఖానికి, మెడకు ప్యాక్ వాడాలి. అరగంట తరువాత కడిగేయాలి. దీనివల్ల శరీరం కోమలంగా మారుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: