జుట్టు మనిషికి అందానికి ఎంతో ముఖ్యమైనది మనిషి ఎంత ఎత్తు ఉన్నా శరీర ఛాయా ఎలాంటి వర్ణం ఉన్నా సరే తలపై జుట్టు ఒత్తుగా నల్లగా లేకపోతే మాత్రం ఆ మనిషి అందంగా కనిపించదు అందుకే మనిషి అందం అంతా జుట్టులోనే దాగుంది అంటుంటారు..మరి అటువంటి జుట్టు ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుని చిక్కి శల్యం అవుతోంది..అయితే అటువంటి జుట్టుని ఎన్నో జాగ్రత్తలతో కాపాడుకుంటూ ఉండాలి అయితే పూర్వం నుండీ మన వాళ్ళు అనుసరిస్తున్న పద్దతులే ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ లో అధిక డబ్బులు వసూలు చేస్తూ ఇప్పటి వాళ్ళు చేస్తున్నారు..

 Image result for rice water for hair

అయితే ఈ బియ్యం నుంచీ వచ్చే విటమిన్స్ B, C & E వంటివి ఆరోగ్యానికి దోహద చేయడం మాత్రమే  కాకుండామీ జుట్టు & చర్మానికి బాగా పనిచేస్తాయి. బియ్యాన్ని కడిగినప్పుడు (లేదా) ఉడకబెట్టినప్పుడు ఈ తెల్లటి ద్రావణాన్ని (గంజిని) పొందవచ్చు, మీరు ఈ ద్రావణాన్ని అనేక సౌందర్య సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించవచ్చు...బియ్యం కడిగిన నీటిలో అనగా గంజిలో ఉండే పిండి పదార్థం మీ జుట్టును మృదువుగా, ఆరోగ్యకరమైనదిగా చేయడంలో సహాయపడుతుంది.

 Image result for rice water for hair

అంతేకాదు ఈ గంజిలో ప్రోటీన్లను & కార్బోహైడ్రేట్లను కూడా ఎక్కువగా కలిగి ఉంటాయి అవి మీ చర్మాని ఎంతో మృదువుగా కోమలంగా చేయడంలో ప్రముక పాత్ర పోషిస్తాయి...చర్మాన్ని ప్రకాశవంతంగా చెయ్యడమే కాకుండా, వృద్ధాప్య ముడుతలని సైతం మీ దరికి రానివ్వదు...అయితే ఈ గంజి నీటిని ఎలా ఉపయోగించాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

 

 Image result for rice water for hair

గంజి, అనారోగ్యంగా ఉన్న మీ జుట్టును దృఢపరచి, మీ జుట్టు యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. గంజిలో ఉన్న ప్రోటీన్లు మీ జుట్టుకు లోతైన కండీషనర్గా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మీ జుట్టు చిక్కుబడటాన్ని కూడా నిరోధిస్తుంది. ఇందుకోసం మీరు 3 వంతుల సాధారణ నీటికి, 1 వంతు గంజిని కలిపి ఉపయోగించండి. మీరు షాంపూతో తలస్నానం చేసిన తరువాత, ఈ గంజి ద్రావణాన్ని అప్లై చేయండి. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఈ పద్ధతినే వారానికి 2-3 సార్లు చెప్పున ఆచరించండి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: