జుట్టు పొడుగ్గా,అందంగా ఎంతో ఒత్తుగా ఉండటానికి ఈ కాలంలో స్త్రీలు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు..అయితే ఇప్పుడు తింటున్న ఆహార పదార్ధాలు కానీ వాయు కాలుష్యం వలన కానీ సిరోజాలు ఎంతో ఒత్తుగా పొడవుగా పెరగాలంటే అంత సామాన్యమైన విషయం కాదు..హెయిర్ ఫాల్..స్ప్లిట్ ఎండ్స్..బ్రేకేజ్ వంటివి శిరోజాల ఎదుగుదల మందగించడానికి ముఖ్య కారణాలు..అయితే  ఈ సమస్యను నివారించేందుకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన పదార్థం కొబ్బరి నీళ్లు...సహజసిద్ధంగా కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలకి మనం వాడుతాం అయితే అదే జుట్టు ఎంతో బలంగా ద్రడంగా మారి మరింతగా గ్రోత్ రావడానికి మాత్రం కారణం కొబ్బరి నీళ్లు తోడ్పడతాయి.

Image result for coconut water hair benefits
ఈ కొబ్బరి నీళ్లలో ఉండే హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ వలన జుట్టు పెళుసులు పెళుసులుగా ఊడిపోయే సమస్యలు తొలగిపోతాయి. తద్వారా..హెయిర్ ను సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు...అయితే చుండ్రు వలన కూడా హెయిర్ ఫాల్ సమస్య ఉత్పన్నమవుతుంది..కొబ్బరి నీళ్ళలో  డాండ్రఫ్ ని తగ్గించి జట్టు ఊడిపోకుండా కాపాడుతాయి..అయితే ఈ కొబ్బరి నీళ్ళని జుట్టు సంరక్షణకి ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం

కొబ్బరి నీళ్ళతో జుట్టుకు రక్షణ
ముందుగా కొబ్బరి నీళ్ళతో పాటు స్కాల్ప్ ని కొబ్బరి నీళ్లతో సర్క్యూలర్ మోషన్ లో మసాజ్ చేయడం చేయాలి ఇలా అయిదు నుంచి పది నిమిషాల పాటు చేస్తూ ఉండాలి... హెయిర్ మొత్తానికి అంటే రూట్స్ నుంచి టిప్స్ వరకు కొబ్బరి నీళ్ళను మసాజ్ చేయండి...ఇలా చేసిన తరువాత ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేయండి..ఆ తరువాత  నార్మల్ వాటర్ తో అలాగే మైల్డ్ షాంపూ తో హెయిర్ ను రిన్స్ చేయండి...ఈ పద్దతిని రెండువారాలు అలాగే కొనసాగించండి..ఇలా చేస్తే తప్పకుండా జుట్టుకి పోషణ అందుతుంది తద్వారా జుట్టు ఊడకుండా మృదువుగా తయారవుతుంది..

Image result for coconut water and lemon hair

నిమ్మ మరియు కొబ్బరి నీళ్ళతో రక్షణ

సహజంగా నిమ్మకాయలో సి విటమిన్ ఎంతో పుష్కలంగా ఉంటుంది..ఈ నిమ్మరసం కోలాజిన్ ప్రొడక్షన్ పెంచుతుంది దీనివలన హెయిర్ గ్రోత్ ఎంతో మెరుగు పడుతుంది...అయితే ఈ పద్దతికి కావాల్సిన పదార్ధాలు.ఎలా అనుసరించాలి అంటే ఒక  పావు కప్పు కొబ్బరి నీళ్లు తీసుకుని ఒక నిమ్మకాయ నిమ్మరసాన్ని  ఆ కొబ్బరి నీళ్లతో కలపండి...ఈ మిశ్రమంతో స్కాల్ప్ పై సర్క్యూలర్ మోషన్ లో ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయండి...ఇప్పుడు, ఈ మిశ్రమాన్ని జట్టుకి పట్టేలా మసాజ్ చేయండి ఆ తరువాత వెచ్చటి టవల్ తో హెయిర్ ను కవర్ చేయండి... పదిహేను నుంచి యిరవై నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత తేలికపాటి, సల్ఫేట్ ఫ్రీ షాంపూతో రిన్స్ చేయండి...ఈ పద్దతిని కూడా ఇదే విధంగా కొనసాగించితే తప్పకుండా జుట్టు పెరుగుదల జరుగుతుంది.




 


మరింత సమాచారం తెలుసుకోండి: