* కొంతమందికి ముఖంపైన మెడ మీద పులిపిరి కాయలు వస్తూంటాయి. అలాంటి వారు దాల్చిన చెక్క కాల్చి ఆ బూడిదని కొంచెం సున్నంలో కలిపి నూనెలో నూరి వాటిపైన రాస్తే అవి రాలిపోతాయి.

* పులిపిరి కాయలు పోవాలంటే అల్లాన్ని సున్నంతో అద్దిపెడితే రాలిపోతాయి.

* పులిపిర్లు పోవాలంటే కాలిఫ్లవర్‌ రసాన్ని రాయాలి. కాలిఫ్లవర్‌ను గ్రైండ్‌ చేసి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని పులిపిరి మీద రాస్తుండాలి. రోజుకు వీలైనన్నిసార్లు కనీసం అరగంట విరామంతో రాస్తుంటే పులిపిరి రాలిపోతుంది. మచ్చకాని గుంట కాని పడటం జరగదు.

* మందం గా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్ద రాస్తే పులిపిరులు ఎండి రాలిపోతాయి .

* రావి చెట్టు ఫై బెరడును కాల్చి బూడిద చేసి సున్నపు నీరు తేటను కలిపి నిల్వచేసుకుని తగినంత మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేసి అది పులిపిరి ఫై పుస్తూ ఉంటే అవి రాలిపోతాయి.

* చిటికెడు అతిమధురం పొడి, చిటికెడు అశ్వగంధ పొడి, రెండు చుక్కలు కొబ్బరి నూనె ,రెండు చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలిపి అల్లంను పుల్లలగా సన్నగా కట్ చేసుకుని ఈ అల్లం పుల్లతో ఫై పేస్టు ను తీసుకుని పులిపిరి ఫై రాయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: