వెంట్రుకలు అధికంగా రాలడానికి పోషాకాహరం తీసుకోకపోవడం, విటమిన్, జన్యు లోపాలు, అధిక ఒత్తిడి, ఆందోళన, ఇబ్బందులు, టైఫాయిడ్, రక్తహీనత, విరేచనాలు, కామెర్ల వంటి దీర్ఘకాల అనారోగ్యాల వంటివి జుట్టు రాలడానికి కారణాలవుతాయి. వీటితోపాటు రక్త సరఫరా సరిగా లేకపోవడం, తల సరిగా శుభ్రం చేసుకోవడం వంటివి కూడా కారణాలే. జుట్టు రాలకుండా ఇంట్లోనే పాటించే జాగ్రత్తలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. వీటిని అనుసరించి బట్టతల బారిన పడకుండా జాగ్రత్తపడండి.


* ఉదయాన్నే అవిసె గింజలు నానపెట్టిన ఒక గ్లాసు మంచి నీటిని తీసుకోవాలి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఆమ్లాలు ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

* రోజూ ఉదయాన్నే ఒక ఉసిరి కాయ తినాలి.

* ప్రతిరోజూ రాత్రి ఐదు ఆల్మండ్ గింజలను నానపెట్టి వాటిని తెల్లవారి ఉదయాన పొట్టు తీయకుండా తినేయాలి.

* మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. ఇవి జుట్టుకి కావలసిన పోషకాలను అందిస్తాయి.

* ఒక గిన్నెడు మొలకెత్తిన గింజలు తినాలి.

* టీ, కాఫీలు తగ్గించాలి. పూర్తిగా మానేస్తే మంచిది.

* తలస్నానం చివర్లో ఒక టీ స్పూను నిమ్మరసంతో కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. చుండ్రు రాదు.

* రోజుకి రెండు గ్లాసుల వెన్న తీసిన పాలు తాగితే ఎంతో లాభం ఉంటుంది.

*వారానికి ఒకసారి మెంతి గింజల గుజ్జును మాడుకు పట్టించి అరగంట తరువాత తల శుభ్రం చేసుకోవాలి. అలాగే పరగడుపున మెంతులు నానపెట్టిన నీళ్లు తాగాలి.

* స్ట్రాబెర్రీలు, అరటిపండ్లు, యాపిల్స్, మామిడి పండ్లు, సపోట, ద్రాక్షలను రోజూ రెండు లేదా మూడు పళ్లు తింటే మంచిది.

* కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పాలకూర ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది.

* చేపలు, కోడి, గుడ్లు వాడకం పెంచితే జుట్టు బాగుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: