గసగసాలను పాలతో నూరి, తలపై లేపనంగా వేస్తే చుండ్రు తగ్గుతుంది.మందార పూల రసానికి సమంగా నువ్వుల నూనె చేర్చి, నూనె మిగిలేంత వరకు కాచి ఆ కషాయాన్ని ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఆ తైలాన్ని రోజుకు ఒకసారి తలకు మర్దనా చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.

వేప నూనె, కానుగ నూనె సమపాళ్లలో కలిపి, కొంచెం కర్పూరం వేసి రాస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది.పారిజాత విత్తనాలను నూరి ముద్దగా చేసి, తలకు మర్దన చేసి, గంట తర్వాత స్నానం చే స్తే చుండ్రు సమస్య చాలా వేగంగా తొలగిపోతుంది.

మెంతులను పెరుగుతో నూరి తలకు లేపనంగా వేస్తూ ఉంటే సమస్య నుంచి బయటపడవచ్చు.త్రిఫలా చూర్ణాన్ని, కుంకుడుకాయల పొడితో కలిపి తలకు పట్టిస్తే, చుండ్రుని నివారించవొచ్చు.

కొబ్బ‌రినూనె, వేప నూనెల‌ను ఉప‌యోగించి త‌యారు చేసిన హెయిర్ ఆయిల్‌ను వాడితే మంచిది. దీంతో చుండ్రు పోవ‌డ‌మే కాదు, జుట్టుకు పోష‌ణ అందుతుంది. త‌ద్వారా శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి కూడా. వెంట్రుక‌లు కాంతివంతంగా మారుతాయి. 

రాత్రంతా మెంతులను నానబెట్టి తెల్లవారుజామున‌ వాటిని మెత్తని పేస్ట్ లా రుబ్బాలి. త‌రువాత ఒక అరగంట పాటు జుట్టుకి ఈ పేస్ట్ ని బాగా పట్టించి కొంత సేపు వేచి ఉన్నాక తేలికపాటి షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు, చుండ్రు బాధ త‌ప్పుతుంది. 

ఒక కప్పు గోరు వెచ్చ‌ని నీటిలో టీ ట్రీ ఆయిల్‌ను ఒక టీస్పూన్ కలపాలి. బాగా క‌లిపాక ఈ నీటితో జుట్టుకి మర్దనా చేయాలి. అరగంట తరువాత త‌ల‌స్నానం చేయాలి. దీంతో చుండ్రు బాధించ‌దు. 




మరింత సమాచారం తెలుసుకోండి: