శరీరానికి శక్తినిచ్చే దుంప జాతి ఆహార పదార్ధాలలో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. దీనిని శాస్త్రీయంగా ‘బేటా వల్గురీస్’ అని కూడ పిలుస్తారు. దీనిలోని బటానినిస్ అనే పదార్ధంతో పేస్టు, జాం, ఐస్‌క్రీంలు తయారుచేస్తారు. కంటికి ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది ఈ బీట్ రూట్.  భూమిలో దొరికే దుంపల వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి..ముఖ్యంగా బీట్ రూట్, క్యారెట్ లాంటివి ఆరోగ్యానికి చక్కటి ఔషదంగా పనిచేస్తాయి. క్యారెట్‌, బీట్‌రూట్‌ రెండూ రక్త శాతాన్ని పెంచుతాయని మనకు తెలిసిందే. కాని కొందరు ఈ బీట్‌రూట్‌ను వెలివేస్తుంటారు.


సౌందర్యాన్ని పెంచే బీట్ రూట్ !

బీట్‌రూట్‌ను తినొచ్చు, జ్యూస్‌గా తాగొచ్చు, కూరగా వండుకోవచ్చు. ఎక్కువమంది దీన్ని కేవలం జబ్బులోస్తే పెట్టే వంటకంగా వాడుతున్నారు.  ప్రాచీనకాలంలోని గ్రీకులు, రోమన్లు కూడా బీట్ రూట్ ను కూరగాయగా వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. అక్కడ నుంచి ఇంగ్లండ్, ప్రాన్స్, జర్మనీలకు రొమన్ల ద్వారా చేరింది. మనదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ విస్తృతంగా దీనిని సాగుచేస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు బీట్‌రూట్ ను తీసుకుంటే లివర్‌ సంబంధ సమస్యలు తలెత్తవు అని పరిశోధనలు తెలుపుతున్నాయి. 

బీట్ రూట్ తో చక్కటి ఆరోగ్యం..!

బీట్‌రూట్‌ ముక్కని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ, చేతులకూ రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది.ముఖ్యంగా మలబద్దకాన్నినివారించడంలో ఈ బీట్ రూట్ జ్యూస్ కీలక పాత్ర పోషిస్తుంది.

సౌందర్యాన్ని పెంచే బీట్ రూట్ !

నైట్రేట్లతోపాటు విటమిన్లు ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ పుష్కలంగా ఈ బీట్ రూట్ జ్యూస్ లో ఉన్నాయి. కాల్షియాన్ని వినియోగించుకోవడానికి తోడ్పడే సైలీషియా సైతం ఇందులో ఉంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌ కు పెద్దపేగుల్లో క్యాన్సర్‌ తో పోరాడే లక్షణం ఉంది.జుట్టు తెల్లబడిందనో, చక్కని రంగులో కనిపించాలనో భావించే వారు రసాయనాలు కలిపిన రంగుల్ని వాడే బదులు బీట్‌రూట్‌ రసాన్ని వారానికోసారి తలకు పట్టించి, అరగంట ఆగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు చక్కని రంగులో కనబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: