మీరు మెడనొప్పితో బాధ పడుతూ ఉంటె మీరు చెయ్యవలసిన మొదటి పని తలను ముందుకు వంచకుండా ఉండడం .  మీరు తల ఎత్తుకుని తిరగడం మొదలు పెట్టండి . మీరు పడుకునేటపుడు తల దిండుకు బదులు గుండ్రంగా  చుట్టిన దుప్పటి గాని , టవల్ గాని మెడ క్రింద పెట్టుకోండి . స్మార్ట్ ఫోన్ లో వాట్సప్  మెస్సేజ్ లు చూడడం  కూర్చుని కాకుండా బోర్లా పడుకుని  చూడండి . మీ తలను  ముందుకు వంచడం  మానండి . 


1. మీ మెడను కుడి ఎడమ పైకి మాత్రమె గాలిని పీలుస్తూ తిప్పండి . వదులుతూ మామూలు స్థితికి  రండి  


2. మీ రెండు చేతులనూ ముందుకు చాపి వేళ్ళను మాత్రమె ముడిచి తెరుస్తూ ఉండండి . ముదిచినపుడు వెళ్ళు కణుపులు వరకూ మాత్రమే ముయ్యాలి . తెరిచినపుడు వేళ్ళ  మధ్య ఖాళీలు ఎక్కువ ఉండేటట్టు తెరవాలి . ఊపిరిని పీలుస్తూ తెరవండి..విడుస్తూ ముయ్యండి . 

3. తరువాత మీ చేతి బొటన వేళ్ళను లోపలి పెట్టి దానిపై మిగిలిన వేళ్ళతో వత్తిడి కలగ చేస్తూ గుప్పిళ్ళను ముయ్యాలి . ( ఊపిరి వదులుతూ )  ఊపిరి పీలుస్తూ గుప్పిళ్ళను తెరవాలి .

4. మీ చేతులను షోల్డర్  లెవెల్ కి చాపి ఉంచి మోచేతి వద్ద  మడుస్తూ అరచేతులు భుజాల వద్ద పెట్టాలి మళ్ళీ చేతులను చాపాలి . ఇలా చెయ్యడం వలన మీ  మోచేతి జాయింట్ ఫ్లెక్సిబుల్  గా తయారవడమే  కాదు . మీ దండలు గట్టిపడతాయి . చేతులలోకి రక్త ప్రసరణ  బాగా జరుగుతుంది . స్పొండిలోసిస్ వలన కలిగే మొద్దుబారడం తగ్గుతుంది 

5. చేతి వేళ్ళను దగ్గరగా చేర్చి , భుజాలపై పెట్టుకుని మోచేతులతో పెద్ద సున్నాలు   చుట్టండి . వెనుకకు వెళ్ళేటపుడు బాగా దూరం గా ఉండేలా , ముందుకు వచ్చినపుడు చాతీ దగ్గర మోతేతులు కలిసిపోఎలా ఈ సున్నాలు చుట్టాలి . 

6. మీ  అర  చేతులను మోకాళ్ళపై  పెట్టుకుని , భుజాలను గుండ్రంగా  ముందుకు సున్నాలు చుట్టండి . తరువాత వెనుకకు చుట్టండి . ఇది భుజాల నొప్పులను పోగొడుతుంది .

7. మీ రెండు చేతులనూ పైకి ఎత్తి , కుడి చేత్తో ఎడమ చేయి మణికట్టు వద్ద ఎడమ చేత్హో కుడి మణికట్టు వద్ద పట్టుకుని , చేతులను తల వెనుక వైపుకు తీసుకు వెళ్లి , ఎడమ చేతిని  దిగువకు లాగుతూ , కుడి మోచేయి తల పై భాగం లోకి వచ్చేలా చేసి తలతో చేతులను వెనుకకు గెంటండి. ఇపుడు మీకు మెడ లో నొప్పి వస్తుంది . ఇది ఫ్రోజెన్ షోల్డర్  కి కూడా బాగా పనిచేస్తుంది . రివర్స్ లో కూడా చెయ్యండి .

8.వెనుకకు నేట్టండి . దీనివలన తలలో మెడ వెన్నుపూసలలో ఒక విధమైన వైబ్రేషన్ కలుగుతుంది . అలా చెయ్యడం   వలన మెడలోని సి 1 నుండి సి 7 వరకూ ఉండే పూసల మధ్య గేప్ పెరుగుతుంది . ఇపుడు చేతులను ముందు నుదురు మీద పెట్టి , వెనుకకు ప్రెషర్ ఇవ్వండి . అలాగే ఎడమ చేతిని ఎడం వైపు కణత మీద పెట్టి కుడి వైపుకు ప్రెషర్ ఇవ్వండి . అనంతరం కుడి చేతిని కుడి కణత మీద పెట్టి ఎడమ చేతి వేపు గెంటండి . తలతో రెసిస్ట్ చెయ్యండి . 

9.మీరు ఊపిరి పీలుస్తూ తలను కుడి వైపుకు తిప్పి గడ్డం (  కుడి భుజాన్ని తాకేలా ) ఊపిరి విడుస్తూ ముందుకు తీసుకు రండి . మీరు ఎంత తిప్పగాలిగితే అంత తిప్పండి . అలాగే ఎడమ వైపుకు కూడా చెయ్యండి . పైకి కూడా చెయ్యండి . కానీ క్రిందకు చెయ్యకండి . 

10. కళ్ళను గుండ్రం గా తిప్పండి . పైకి , కుడికీ , దిగువకూ , ఎడమ వైపుకూ ..  తిరిగి రివర్స్ లో తిప్పండి . ఈ  సూక్ష్మ  వ్యాయామాలు మీ మెడ నొప్పిని  తగ్గించడం లో చాలా ప్రయోజనకరాలు . వీటిని మీరు ఎప్పుడైనా చెయ్యవచ్చు . 


మరింత సమాచారం తెలుసుకోండి: