సెల్ ఫోన్ అతిగా రాత్రి వాడినపుడు కాళ్ళు  మంటలు ,ఒళ్ళు నొప్పులు, రాత్రుళ్ళు నిద్ర రాకపోవడం మరియు ఉదయం నిద్ర లెవలేకపోవడం మరియు ఇలాంటి ఎన్నో జబ్బులకు దూరంగా ఉండాలి అంటే  ఒకటే మె,డిసిన్.  నిద్ర సరిగా లేకుంటే, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ సరిలేక, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిస్తుందని అది అధిక రక్తపోటుకు దారితీస్తుందని తెలిపారు. దీనితో రక్తనాళాలు గట్టిపడి గుండె వ్యాధులకు దోవతీస్తుందన్నారు. చివరగా అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ పెద్దలు ప్రతి రాత్రి షుమారుగా 7 నుండి 8 గంటల పాటు తప్పక నిద్రించాలని తెలిపింది.
                   
* పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోవాలి. 

* బెడ్‌రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మరీ చల్లగానూ, మరీ వేడిగా కాకుండా ఉండాలి. నిద్ర వేళ ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి.

* సాయంత్రం వేళల నుంచి కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్‌ను తీసుకోకూడదు.

* రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

* పగటి పూట కునుకు తీయవచ్చు. ఎక్కువసేపు నిద్రపోకూడదు.

* ప్రతీ రోజు ఒకే నిర్ణీత వేళకి నిద్ర పోవాలి.

* నిద్రకు ఉపక్రమించే ముందర టీవీలో ఉగ్వేదం కలిగించే దృశ్యాలున్న సినిమాలూ, సీరియళ్ళు చూడకూడదు.

* రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పగటి వెలుగులో గడపాలి. మసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రి వేళల్లో సరిగా నిద్రపట్టదు.

* నిద్రకు ముందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినాలి.

* గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్రపడుతుంది.

* నిద్రకు ముందు పుస్తకాలు చదవడం వంటివి చేయకూడదు. పుస్తకం చదువుతూ వుంటే అలా మనకు తెలియకుండానే నిద్రపడుతుందని చాలా మంది అంటారు. కానీ... నిజానికి దృష్టి పూర్తిగా చదవడంలో నిమగ్నమైపోతే నిద్రకు దూరమైయ్యే అవకాశం ఎక్కువ


మరింత సమాచారం తెలుసుకోండి: