మన శరీరంలోని ప్రతి అవయవానికి ఆహారం అవసరం. ఒక్కో అవయవం ఒక్కో రకమైన ఆహారాన్ని కోరుకుంటుంది. మెదడు అచ్చు వాల్ నట్ ఆకారంలో ఉంటుంది. అందుకే వాల్ నట్స్ ఎక్కువగా తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఆలివ్ పళ్లను పోలినట్టు ఉంటాయి మహిళల్లోని ఓవరీలు. నిత్యం ఆలివ్ ఆయిల్ వాడే మహిళల్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ 30శాతం తక్కువ. ద్రాక్ష గుత్తి హృదయాకారంలో ఉంటుంది. ద్రాక్ష లోని ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండెజబ్బుల నివారణలో తోడ్పడతాయి. క్యారట్ లు కంటిని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రక్తంలోని చక్కెరలను నియంత్రిస్తుంది చిలకడదుంప. కాల్షియం ఎముకల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. మునగాకు, పాలకూరల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: