పెదవులు గులాబీ రేకుల్లా ఉండాలంటే పళ్లు,నోరు కూడా శుభ్రంగా వుండాలి. చాలా మంది బ్రెష్ చేసుకోరు. ఏదైనా తినగానే నోరు పుక్కిలించాలి. భోజనాంతరం క్యారెట్స్ కాని, ఆపీల్స్ కాని తినడం వల్ల పళ్ల సందుల్లో ఇరుకున్న పధార్థాలు తొలగించబడుతాయి. రాత్రి నిద్రించేముందు. కూడా పళ్ళు శుభ్రంగా కడుక్కొవాలి. పెదవులకు కొబ్బరినూనె, వ్యాసలైన్ లేదా వెన్నగాని రాస్తుంటే మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. బయటకు వెళ్లేటప్పుడు లిప్ స్టిక్, లిప్ గ్లాస్, లేదా లిప్ షైనర్ వాడటం వల్ల కాలుష్యం వల్ల పెదవులకు హాని కలగదు.


పెదవులు నల్లగా వుండటం అనేది చాలా మందిని వేదించే సమస్య, ఇలాంటి వారు పాలల్లో గులాబీ రేకులు కలిపి, మెత్తగా నూరి రాస్తే ఈ సమస్య తొలుగుతుంది. కొత్తిమీర రసం లేదా పుదీనా రసం రాసినా మంచి ఫలితం వుంటుంది. పెదవులు పగిలినపుడు పెట్రోలియం జెల్లి కాని, నెయ్యి, వెన్న, పాలమీగడ, లిప్ బామ్ వంటివి రాసుకోవాలి.  తరచుగా పెదవులను నాలుకతో తడపకూడదు. కృత్రిమ లిప్ గ్లాస్ ఉపయోగించడానికి ఇష్టపడనివారు. నారింజరసం పేదవులుకు రాస్తే లిప్ గ్లాస్లా పనిచేస్తుంది.


గ్లిసరిన్ రోజ్ వాటర్, నిమ్మరసం, ఆవపొడి కలిపి పెదవులకు రాస్తే పెదవులకు రాస్తే మృదువుగా, తయారువుతాయి. పాలల్లో గులాబీ రేకులు నానపెట్టి పెదవులకు రాస్తే పెదవులు మృదువుగా తయారవుతాయి. మొదటి లిప్ లైనర్ తర్వాత లిప్ స్టిక్ వేసుకుని ఆ పైన లిప్ షైనర్ వేసుకుంటే బాగుంటుంది. రాత్రివేళ డార్క్ కలర్స్, పగటివేళ లైట్ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. బ్లషర్, లిప్ స్టిక్ కలర్ ఒకే రంగుని అయితే మంచిది. రెండు సంవత్సరాలకు మించి వాడకూడదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: