చాలామంది శరీరం మొత్తం తెల్లగా ఉన్నా మోచేతి క్రింద , మోకాళ్ళ దగ్గర ఇలా కొన్ని కొన్ని ప్రదేశాలలో నల్లటి చారికలు ఉంటూ ఉంటాయి. అవి ఎంతా సబ్బుతో రుద్దినా సరే పోవు.అయితే మోచేతులు మోకాళ్ళు దగ్గర ఉండే నల్లని నలుపుని సైతం పోగొట్టే సహజపద్దతి చిట్కాలు ప్రక్రుతి ఎన్నో ప్రసాదించింది. అయితే వాటిని సరిగా వినియోగొంచుకుంటే సహజసిద్ధంగా నలుపుని పోగొట్టుకోవచ్చు.

 Image result for tulsi paste for black spots

ప్రకృతిలో అత్యంత ముఖ్యమైన సహజసిద్దమైనది తులసి, పూర్వీకుల నుంచీ తులసి ఆకుకి ఎంతో ప్రాధన్యత ఉంటుంది. అయితే తులసి ఆకు ద్వారా మోచేతుల ప్రాంతలో ఉండే ఎంతటి నలుపు అయినా పోతుంది.అయితే ఇందుకు ఓ పద్దతి కూడా ఉంది. ముందుగా తులసి ఆకుని మెత్తగా చూర్ణంలా చేసుకుని అందులోనే  కాస్త పాలమీగడ కలుపుకోవాలి..ఇలా కలుపుకున్న తరువాత...వచ్చే పేస్టుని మోచేతులతో పాటు నల్లగా శరీరంపై ఉన్న ప్రాంతాలలో పూసుకోవాలి. ఇలా కంటిన్యూ గా చేయడం వలన నలుపురంగు పోవడమే కాకుండా ఎంతో కాంతి వంతంగా ఉంటుంది...అంతేకాదు

 Related image

ఒక నిమకాయని సగానికి కోసి , తినే షోడా ఉప్పుని కొంచం తీసుకుని సగం కోసిన నిమ్మ చెక్కని తినే సోడా ఉప్పులో బాగా అద్ది శరీరంలో నల్లగా ఉన్నప్రాంతాలలో రుద్దాలి, అలాగే ముక్కుపై వచ్చే నల్లటి వలయాలపై కూడా ఇలా చేయడం నల్లటి మచ్చలు పోతాయి, అదేసమయంలో చర్మం కూడా పొడి బారిపోకుండా, ఎంతో మృదువుగా తయారవుతుంది...ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే తప్పకుండా చర్మంపై ఉండే నలుపు మచ్చలని తగ్గించుకోవచ్చు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: