కావలసినవి  గింజలు లేని ఖర్జూరం 50 గ్రా.  స్ప్రింగ్ రోల్ షీట్ 10  కొబ్బరిపాలు 15 ఎం.ఎల్  రిఫైన్డ్ ఆయిల్ తగినంత  కిస్మిస్ 10 వాల్నట్స్ 25 గ్రా  తయారీ విధానం ఖర్జూరాలను సన్నగా తరగాలి. దీంట్లో వాల్ నట్స్ ను క్రష్ చేసి కలపాలి. స్ప్రింగ్ రోల్ షీట్ ను ప్లాట్ గా పరిచి, ఖర్జూరాల మిశ్రమం వెడల్పుగా సర్ధాలి. దీన్ని చతురస్ర ఆకారంలో కట్ చేసుకోవాలి. కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి. తయారు చేసుకున్న పాన్ కేక్ లను నూనెలో వేసి వేయించి తీయాలి. చాకుతో త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి. కిస్మిస్, కొబ్బరి, క్రీమ్, సాస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: