సాధారణంగా ఆడవారికి మీసాలు,హిర్సుటిజం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నవీన్ రోయ్  నిపుణులను సంప్రదించాలి.  ఎక్కడైనా సిగ్గు పడొచ్చుగానీ వైద్యం దగ్గరా, వైద్యుల ముందరా సిగ్గుకు తావులేదు. జబ్బును ఒప్పుకోవటానికీ, బాధలు చెప్పుకోవటానికీ బిడియపడుతూ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చెయ్యటం.. చేజేతులా ప్రమాదాన్ని కొనితెచ్చుకోవటమే అవుతుంది.

అది నోటి దుర్వాసన కావచ్చు.. జననాంగ దురద కావచ్చు.. వీటి గురించి బిడియపడకుండా వైద్యులను సంప్రదించటం చాలా అవసరం. వీటిలో కొన్ని ఆరోగ్యపరంగా ప్రమాదకరమైనవి కాగా మరికొన్ని మనిషిని సామాజికంగా కూడా అందరికీ దూరం చేసేస్తాయి. అందుకే మనలో చాలామంది అసలు వైద్యులను కలిసేందుకే సిగ్గుపడుతుండే అతి సాధారణమైన, కీలకమైన సమస్యలు కొన్నింటి గురించి తెలుసుకుందాం.

ఆడవారికి మీసాలు :
అవాంఛిత రోమాలు ఉంటే వాటిని తొలగించడం... శ్రమ అవుతుంది. తెల్లగా, నునుపుగా, పట్టుకుంటే జారిపోయేలా చర్మం ఉండాలనుకుంటారు అమ్మాయిలు. తలపై తప్ప శరీరంపై ఎక్కడ రోమం కనిపించినా బాధే. హెయిర్ రిమూవల్ క్రీములు, త్రెడింగ్, వ్యాక్సింగ్, ప్లకింగ్, లేజర్... అంటూ రకరకాల పద్ధతుల ద్వారా వాటిని తొలగించుకునే పనిలో పడుతున్నారు. అసలు అమ్మాయిల్లో అవాంఛిత రోమాల సమస్య ఎందుకు వస్తాయి? వాటిని తొలగించడానికి అతివలు పడరాని పాట్లు ఎందుకు పడతారు.

ఆ రోమాలను కొండంత శ్రమతో కాకుండా... తేలిగ్గా వదిలించుకోడం ఎలా...?
కొందరు స్త్రీలకు ఉన్నట్టుండి పురుషుల మాదిరిగా ముఖం మీద, పైపెదవి మీద, ఒంటి మీద రోమాలు పెరగటం ఆరంభమవుతుంది. దీంతో నలుగురిలోకి వెళ్లాలన్నా, అద్దంలో చూసుకోవాలన్నా బిడియపడుతూ బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారేగానీ వైద్యులను సంప్రదించేందుకు మాత్రం వెనకాడుతుంటారు. కొందరైతే షేవింగ్‌ వంటి వాటిని ఆశ్రయిస్తూ, పైకి కనబడకుండా ఉండేందుకు క్రీములు రాస్కుంటుంటారు. కానీ ఇలా వెంట్రుకలు పెరుగుతున్నాయని గమనించిన వెంటనే, సిగ్గు పక్కనబెట్టి వెంటనే వైద్యులను కలవటం అవసరం.

ఎందుకంటే స్త్రీలలో మీసాలు, గడ్డాలు పెరగటాన్ని 'హిర్సుటిజం' అంటారు, ఇది చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఒక సంకేతంలాంటిది. చాలామంది ఆడపిల్లల్లో అండాశయాల మీద నీటి తిత్తులు వచ్చి (పీసీఓఎస్‌), హార్మోన్లు అస్తవ్యస్తమై, దాని కారణంగా ఇలా వెంట్రుకల పెరుగుదల మొదలవ్వచ్చు. ఈ సమస్య ఊబకాయుల్లో మరీ ఎక్కువ. అలాగే శరీరంలో కీలక హార్మోన్లను ఉత్పత్తి చేసే అడ్రినల్‌, పిట్యూటరీ, థైరాయిడ్‌ వంటి గ్రంథుల మీద కణుతులు, గడ్డలు పెరిగి.. హార్మోన్‌ వ్యవస్థ అస్తవ్యస్తమైనప్పుడు, ముఖ్యంగా పురుష హార్మోన్ల స్థాయులు పెరిగినప్పుడు ఈ బెడద మొదలవ్వచ్చు. ఇదే కాకుండా ఫిట్స్‌ వంటి కొన్ని రుగ్మతలకు వాడే మందుల వల్ల, స్టిరాయిడ్స్‌ వల్ల కూడా ఇలా జరగొచ్చు. కాబట్టి బిడియం వీడి వైద్యులను కలిస్తే మూల కారణమేమిటో అన్వేషించి, తగిన చికిత్స అందిస్తారు


మరింత సమాచారం తెలుసుకోండి: