చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చుతాయి, దంతాలు దెబ్బతింటాయి. బరువు పెరుగుతామని చాలా మంది వాటికి దూరంగా ఉంటారు. అయితే, చాక్లెట్స్ తినడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వ్యాధిని నివారించవచ్చు. చాక్లెట్ లో ఉపయోగించే కోకో లోని పోషకాల్లో ఫ్లేవనాల్ ఉంటుంది. అవి అల్జీమర్స్ ని దూరం చేస్తాయని శస్త్రవేత్తలు అంటున్నారు. పరిమితంగా చాక్లెట్లను తినడం వల్ల మతిమరుపు దూరం అవుతుంది. వృద్ధాప్యం రాకముందే తినడం వల్ల అల్జీమర్స్ భయం ఉండదని చెబుతున్నారు. అయితే, కోకో మితిమీరిన క్యాలరీలు ఉన్న చాక్లెట్లకు మాత్రం దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: