అందం ఎవరికి చేదు, అందం పాళ్ళు కొంచం తగ్గితే చాలు అద్దంలో ముఖం చూసుకుంటూ తెగ బాధపడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే అందం పేరు చెప్పగానే ముఖ్యంగా గుర్తొచ్చేది స్త్రీలు..అయితే వారి ఒక్కరికే సొంతమా, మగవారికి అందంపై హక్కులు లేవా, మగవారు మరింత అందంగా కనపడటానికి ఏమి చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే జాగ్రత్తలు మాత్రం ఎవరూ పట్టించుకోరు. అయితే మగవారు తమలో ఉన్న అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలన్నా, లేదా జాగ్రత్తలు తీసుకోవాలన్నా కొన్ని పద్దతులని పాటించాల్సిందే.

 Related image

 

బాదం పప్పు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వాటిని రాత్రంతా నానపెట్టి ఆ తరువాత పొట్టు తీసేసి దాన్ని ఒక మిశ్రమంగా తీసుకోవాలి.ఒక టీ స్పూన్ బాదం పప్పు మిశ్రమాన్ని తీసుకుని దానికి కాస్తంత నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. కొంత సమయం తరువాత ముఖాన్ని కడిగేసుకోవాలి ఇలా చేయడం వలన కొన్ని రోజులకి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

 Related image

అలాగే కొన్ని కాఫీ గింజలు తీసుకుని బాగా పొడి చేసుకుని అందులో కాస్త బాదం పాలు కలుపుకుని దాని ముఖానికి రాసుకోవాలి. కాసేపటి తరువాత వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వలన కూడా మీ ముఖం అందంగా, ,మృదువుగా తయారవుతుంది.

 Related image

బాదం నూనె కూడా మీ అందాన్నిరెట్టింపు చేస్తుంది. బాదం నూనె లో ఉండే ఏ, ఈ విటమిన్స్ చర్మంపై ఉండే దుమ్ముధూళిని తొలగిస్తాయి. బాదంనూనె, కొబ్బరి నూనె కలుపుకుని ముఖంపై డ్రై గా ఉండే ప్రాంతంలో లేదంటే కాస్త నల్లగా ఉండే ప్రాంతంలో రాసుకోవడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు..వీటన్నిటితో పాటు రోజు ఉదయాన్నే లేచింది మొదలు పడుకునే వరకూ 4 ల్లీటర్ల మంచి నీళ్ళకి తగ్గకుండా త్రాగుతూ ఉంటె శరీరంలో తేమ ఉండటం వలన అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు.





మరింత సమాచారం తెలుసుకోండి: