నెలో ప్రతి కిలో గ్రాముకి 3190 కిలో కేలరీల శక్తివుంది. కార్సో హైడ్రైట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ సి, సోడియం, పొటాషియం, సల్ఫర్, క్లోరిన్, బి-కాంప్లెక్స్ విటమిన్లు తేనెలో ఉన్నాయి. తక్షణ శక్తికోసం తేనెలను సేవించవచ్చు. పేగులకు సంబంధించిన వ్యాదులు, గ్యాస్ట్రిక్ వ్యాదులకు, కీళ్లనొప్పులకు తేనె చక్కటి ఔషధం. తేనె జీర్ణశక్తిని పెంచుతోంది. శ్వాస సంబంధమైన చర్యలు తేనెవల్ల తొలగిపోతాయి. నిద్ర లేమితో బాధపడేవారు రోజూ రాత్రి తేనెను సేవిస్తే హాయిగా నిద్రపడుతుంది. తేనె యాంటీ సెప్టిక్ లోషన్గా కూడా ఉపయోగపడుతుంది.


గాయాలను తేనెతో శుభ్రపరచి డ్రెస్సింగ్ చేయవచ్చు. చర్మ సమస్యలకు తేనె అద్భుతంగా పని చేస్తుంది. తేనె మంచి ఔషధకారి మాత్రమేకాదు, సౌందర్య సాధనాల తయారీలో కూడా దీనికి ప్రత్యేక స్థానముంది.  మొటిమలవల్ల ఏర్పడిన మచ్చలు పోవడానికి ఉల్లిరసం తేనెలో కలపి అప్లై చేయండి. తేనె, ఆలీవ్ ఆయిల్ కలిపి తలకు పట్టించుకుంటే జుత్తు చక్కటి ఆరోగ్యంతో నిగనిగలాడుతుంటుంది.


చర్మ సౌందర్యానికి తేనె ఎంతగానో ఉపయోగకరిస్తుంది.  తేనెలన్నింటోకి పట్టుతేనె శ్రేష్టమైనది. తేనెకున్న మరోక ప్రత్యేక గుణమేమిటంటే ఇది సంవత్సరాలపాటు నిల్వ ఉంటుంది. ఇన్ని సుగుణాలున్న తేనె మానవాళికి ప్రకృతి ప్రసాధించిన ఒక అద్భుతం అనడంలో అతిశయోక్తి లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: