వేసవి కాలంలో అందుబాటులో ఉంటూ శరీరాన్ని చల్లబరిచి వేడిమి నుంచీ కాపాడేది ఏది అంటే అందరూ చెప్పే పేరు పుచ్చకాయ. ఈ పుచ్చకాయలో అధిక శాతం నీరు ఉంటుంది. ఇది తినడం వలన శరీరం చల్లబడటమే కాదు, మానసిక ఉత్తేజం కూడా కలుగుతుంది. డీ హైడ్రేషన్ సమస్యని దూరం చేసే ఏకైక మార్గం పుచ్చకాయే. అయితే ఎంతో మంది దీనిని తినడానికి మాత్రమే ఉపయోగిస్తారు కానీ ఇది చర్మ సంరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తుందనేది చాలా మందికి తెలియని విషయం.

 Image result for watermelon

పుచ్చాకాయలో ఉండే విటమిన్ A, B6 మరియు C లు చర్మానికి ఎంతటి మేలు చేస్తాయంటే. మీ చర్మాన్ని తేమగా మరియు హైడ్రేట్ చేస్తుంది. ఇది ఒక  సహజసిద్దమైన స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్ వలె పనిచేస్తుంది.  పొడి బారిని చర్మానికి ఉత్తమమైన శక్తిని ఇస్తుంది. అయితే ఈ పుచ్చాకాయని ఉపయోగించి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పుచ్చకాయ పాలతో ఫేస్ మాస్క్

 Related image

పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం నిగారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఈ పాలు, పుచ్చ కాయ రసం ఈ రెండు చర్మ రక్షక సాధనాలతో ఎలా పేస్ మాస్క్ చేసుకోవాలో చూద్దాం.  ముందుగా  2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం , 2 టేబుల్ స్పూన్ల పాలు ,1 విటమిన్ E టాబ్లెట్. తీసుకోవాలి. ఒక గిన్నెలోకి కొంత పుచ్చకాయ రసం తీసుకుని. దానికి కొంత పాలని కలపాలి. ఆ తరువాత విటమిన్ E టాబ్లెట్ లని కట్ చేసి వాటిని ఆ మిశ్రమంలో కలియతిప్పాలి. ఇలా చేయగా వచ్చిన మిశ్రమాన్ని ముఖం, మేడపై  పట్టించి సుమారు 30 నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన చర్మం ఎంతో సున్నితంగా, కాంతివంతంగా ఉంటుంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: