ప్రతీ ఒక్కరూ తమకి ఎంతో ఆకర్షణీయమైన, ప్రకాశవంతమైన చర్మం కావాలని కోరుకుంటారు అందుకు తగ్గట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, కెమికల్స్ తో కూడిన సౌందర్య సాధనాలని వాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలా మంది ముఖాలు అందవిహీనంగా తయారవుతూ ఉంటాయి. అంతేకాదు చర్మ వ్యాధులు, క్యాన్సర్ లవంటి బారినపడి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. కానీ ఇంట్లోనే సహజసిద్దమైన పదార్ధాలతో ఫేస్ మాస్క్ లని చేసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్ లు రాకుండా, ఎంతో కాంతి వంతమైన చర్మం సొంతం చేసుకోవచ్చు.

 Image result for potato face mask

ముఖ్యంగా బంగాళాదుంప తో ఫేస్ మాస్క్ పెట్టుకోవడం వలన చర్మానికి సహజసిద్దమైన మెరుపు, రంగు వస్తాయి.బంగాళదుంప తో ఫేస్ మాస్క్ సిద్దం చేసుకుని ముఖానికి పట్టించడం వలన అందులో ఉండే పోషకాలు ముఖాన్ని ఎంతో తెజోవంతగా ఉంచుతాయి. మరి అలాంటి ఫేస్ మాస్క్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఓ లుక్కేద్దాం..

 Image result for potato face mask

ముందుగా బంగాళదుంప ఒకటి తీసుకోవాలి, దానితో పాటు ముక్కలు చేసిన కీరా దోస ఒకటి తీసుకోవాలి. అదేవిధంగా ముక్కలుగా చేసిన నిమ్మకాయని కూడా తీసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు తీసుకోవాలి. వీటన్నిటితో పాటు ఒక మీడియం సైజ్ గిన్నెను తీసుకోండి.,గిన్నెలో బంగాళా దుంప రసాన్ని తీసుకోండి. ఇప్పుడు, గిన్నెలోకి దోసకాయ రసాన్ని తీసుకుని  ఆ రెండు మిశ్రమాలని బాగా కలపండి. ఆ తరువాత ఇందులో కొంచం నిమ్మరసం కూడా కలపండి. అంతా అయ్యిపోయింది అనుకున్న తరువాత చిటికెడు పసుపుకూడా కలిపి  ఓ పేస్ట్ లా తయారు చేసుకుని ముఖానికి పట్టించి తరువాతా 20 నిమిషాలు అలాగే ఉంచుకుని తరువాత కడిగేయండి. ఇలా వారానికి రెండు రోజుల పాటు చేయడం వలన మీ అందం మెరుగుపడటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: