ఆడ, మగా తేడా లేకుండా అందరూ ఎదుర్కునే ఏకైక సమస్య ముఖంపైన అక్కడక్కడా వచ్చే మొటిమలు. ఈ సమస్య ముఖ్యంగా యుక్త వయస్సు వారిని వేధిస్తూ ఉంటుంది. కాలేజీలకి వెళ్ళే వారైతే మొటిమలు ముఖంపై ఉంటే కాలేజీనే మానేసి ఇంట్లో కూర్చునే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యని ఎదుర్కునే వారు, ముఖ్యంగా ఎదుర్కునే మరొక సమస్య ముఖంపై వచ్చిన మొటిమలని గోర్లతో గిల్లడం. అయితే

 Image result for pimples face

ఇలా చేయడం వలన చర్మంపై గుంతలు ఏర్పడి ముఖం అందవిహీనంగా తయారవుతుంది. ముఖంపై మొటిమలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి. ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి. ఒక వేళ మొటిమలు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. మొటిమలు అనేవి సాధారణంగా  ఒత్తిడి, హార్మోన్లలో అసమతుల్యత, మనం తీసుకునే ఆహార పదార్ధాల వలన కలుగుతుంది. కొన్ని ఆహార పదార్ధాలు దూరం చేయడం వలన తప్పకుండా మొటిమలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

 Related image

అధిక కొవ్వుని కలిగిన పదార్ధాలు తీసుకోవడం వలన మొటిమలు వచ్చే అవకాశాలు అధికంగానే ఉంటాయి. అదేవిధంగా బ్రెడ్ ని తరుచుగా తినే వారికి కూడా మొటిమలు వస్తాయి ఎందుకంటే. బ్రెడ్ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ స్థాయిలను తగ్గిస్తుంది. అందులో ఉన్న లో గ్లూటెన్ను  మొటిమలు రావడానికి ముఖ్యకారం అవుతుంది.అందుకే బ్రెడ్ ని మీరు దూరం పెట్టడం ఉత్తమం. అంతేకాదు చాక్లెట్, జున్ను, పెరుగు మీద మీగడ , పన్నీర్ లాంటి పదార్ధాలని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది వీటి వలన మొటిమలు రావడం మాత్రమే కాదు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చి పడతాయి.

 Related image

ముఖ్యంగా యువతీ యువకులకి హార్మోన్స్ లో మార్పులు జరగడం వలన మొటిమలు వస్తాయి వాటిని గోర్లతో గిల్లడం వంటి పనులు చేయకుండా ఉంటే వాటంతట అవే తొలగిపోతాయి. కానీ త్వరగా తగ్గడానికి మంచి గంధం నూరి మెత్తగా వచ్చిన గంధాన్ని మొటిమలపై ఆరారగా రాస్తూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: