ముల్లంగి చాలా మంది ఈ కూరగాయని దూరం పెడుతారు. ముల్లంగి తో వంటల్లో వాడటం చాలా  తక్కువనే చెప్పాలి. పెద్దగా ఎవరూ పట్టించుకోని ముల్లంగిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని, ముల్లంగి చర్మ సౌదర్యం మొదలు అనేకరాలా సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారని చాలా మందికి తెలియదు. ఇది అధిక బరువుని తగ్గించడం మాత్రమే కాదు, చర్మాన్ని డీ హైడ్రేషన్ నుంచీ కాపాడుతుంది. ఫలితంగా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.

 Related image

ముల్లంగిని తరచుగా ఉపయోగించడంవలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల,  మీ చర్మాన్ని కాలుష్యం, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కాపాడుతుంది. చర్మంలో అతర్ఘటంగా ఉండే మలినాలని మురికిని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఈ ముల్లంగిని ఉపయోగించి ముఖంపై వచ్చిపడే మొటిమలని ఎలా నివారించావచ్చో చూద్దాం.

 Image result for radish face pack for pimples

కావలసిన పదార్ధాలు :

  • 1 టీస్పూన్ ముల్లంగి గింజలు
  • నీరు (తగినంత) ఉపయోగించు విధానం
  •  ముల్లంగి గింజలను మెత్తగా రుబ్బి పొడిలా చేసుకోవాలి.
  • దీనికి కొన్ని చుక్కల నీటిని జోడించి, మిశ్రమంగా తయారు చేసుకోడానికి బాగా కలపండి.
  •  ఈ పేస్ట్ ను మీ ముఖం మీద వేళ్ళతో బాగా రాయండి.  
  • అది పూర్తిగా ఎండిపోయేవరకు వదిలేయండి.
  • చల్లటి నీటిని ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేయండి.
  • ఇలా వారానికి రెండు సార్లు చేయడంవలన ముఖంపై మొటిమలు తొలగిపోయి, చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: