ప్రకృతి సహజసిద్ధంగా వచ్చే ఎటువంటి మొక్కలు అయినా, వాటి నుంచీ వచ్చే ఫలాలు, పూలు, కూరగాయలు ఇలా ప్రతీదీ మనిషి బాహ్య సౌదర్యానికి, అంతరంగా ఉండే జీవక్రియలకి ఎంతో మంచిని చేస్తాయి. ముఖ్యంగా ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగిన ఫలాలు మనకి అందుబాటులోనే ఉన్నా వాటిని విశిష్టతని తెలుసుకోలేక, వాటిని ఉపయోగించుకోలేక పోతున్నాము. అందుకే పూర్వం నుంచీ పెద్దలు పాటించిన సౌదర్య సాధనాలని ఇప్పుడు మనం కొత్తగా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం..

 Image result for water milan keera dosa face pack

ముఖాన్ని నిగారించడానికి, ఎంతో అందంగా వారి మోముని తీర్చి దిద్దడానికి ఎన్నో సాధనాలు ఉన్నా వేసవి కాలంలో ముఖాన్ని ఎండ వేడిమి నుంచీ కాపాడటానికి మాత్రం అద్భుతమైన సహజసిద్దమైన ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వేసవిలో సీజనల్ గా దొరికే పుచ్చకాయ, కీర దోసకాయ.వీటితో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవచ్చే ఇప్పుడు చూద్దాం. కీర దోసలో మొటిమలు , మచ్చలు పోగొట్టే పోషకాలు పుష్కలమా లభ్యం అవుతాయి. పుచ్చకాయ వేడిని తగ్గించి నీటి శాతం శరీరంలో తగ్గిపోకుండా బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు పుచ్చకాయ, కీర దోస రెండు కలిసి ఉపయోగించే ఫేస్ ప్యాక్ ఎలా చేయాలి, వాటి ఉపయోగం ఏమిటో చూద్దాం.

 

కావలసిన పదార్ధాలు :

  •  1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసం
  •  1 టేబుల్ స్పూన్ దోసకాయ గుజ్జు

Image result for water milan cucumber face pack

ఉపయోగించు విధానం :  

ఒక గిన్నెలో కొంత పుచ్చకాయ రాసాని తీసుకుని, అందులోనే కీర దోస గుజ్జుని కూడా కలిపి మిశ్రమంగా చేయాలి.  ఈ రెండిటిని బాగా కలియబెట్టాలి. బాగా రెండిటిని కలిపిన తరువాత మీ ముఖంపై మరియు మెడపై ఈ మిశ్రమాన్ని అప్ల్లై చేయండి. దాదాపు 30  నిమిషాలపాటు ముఖంపై ఉంచి ఆరబెట్టాలి. ఆ తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా చేసుకోండి. మెత్తని గుడ్డతో మాత్రమే ముఖాన్ని సున్నితంగా తుడిచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలని మీరు పొందవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: