చర్మసౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి, మరింత మెరుపుతో చర్మం నిగనిగలాడటానికి ఎన్నో రకాల సహజసిద్దమైన సాధనాలు మనం చేసుకుంటాం. ఎన్నో పద్ధతులు పాటిస్తుంటాం. కానీ వేసవిలో ఎండ దెబ్బకి కమిలిపోయిన చర్మాన్ని మళ్ళీ సహజ చర్మంగా మార్చుకోవడానికి, మరింత కాంతివంతంగా చేయడానికి ఉన్న ఏకైక పద్దతి కీరదోస పేస్ ప్యాక్. వేసవిలో చర్మానికి కీర దోస చేసే మేలు మరేది చేయదు అనడంలో సందేహం లేదు. మరి ఈ కీర దోసని ఉపయోగించి పేస్ ప్యాక్ ఎలా చేయాలో చర్మాన్ని ఎలా సంరక్షించు కోవాలో ఇప్పుడు చూద్దాం.

 Image result for cucumber summer face pack

వేసవిలో చాలా మంది కాసేపు బయటకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే చర్మం ఎర్రగా మారిపోతుంది. ఎర్రగా కమిలిపోయి ఒక్కో సారి పుళ్ళు కూడా ఏర్పడే పరిస్థతి ఎదురవుతుంది. ఈ పరిస్థితి దాదాపు చాలా మంది ఎదుర్కునే ఉంటారు. ఈ పరిస్థితి రాకుండా ముఖం ఎంతో ఫ్రెష్ గా, చర్మం కమిలిపోకుండా ఉండాలంటే కీరదోస గుజ్జుతో ముఖానికి ప్యాక్ పట్టాల్సిందే. ఈ ఫేస్ ప్యాక్ చేసుకోవాలంటే. ముందుగా కొంత కీరదోస గుజ్జుని తీసుకుని , దానిలో కొంచం నిమ్మరసం , రోజ వాటర్ ని కలిపి ముఖానికి పట్టించాలి. సుమారు 30 నిమిషాల తరువాత బాగా ఆరిని ముఖాన్ని చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రోజుకొక సారి చేస్తూ ఉంటే చర్మం మెరవడంతో పాటుగా ఎంతో నునుపుగా మారుతుంది.

 Image result for cucumber summer face pack


అదేవిధంగా ముఖం చాలా మందికి పొడిబారినట్టుగా మారుతుంది. గగ్గుర్లు గగ్గుర్లుగా ముఖం ఉంటుంది. అలాంటి వారు, కీరదోస గుజ్జులో కాస్తంత పెరుగు, శనగపిండి కలిపి ముద్దగా చేసి, ముఖానికి పట్టించాలి. ఇలా చేసిన తరువాత ఒక అరగంట పాటు ఆరనిచ్చి ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. చాలా మందికి తెలిసిన విషయమే అయినా పాటించడంలో మాత్రం అలసత్వం చేస్తారు కాబట్టి ఈ పద్దతులు తప్పనిసరిగా పాటిస్తే చర్మం మంచి వచ్చస్సు రావడం మాత్రం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: