ఉసిరికాయ అంటే అందరికి గుర్తొచ్చేది పెరట్లో పెంచుకునే పసుపురంగులో ఉండే చిన్న చిన్న ఉసిరికాయలు అనుకునేరు మామూలు ఉసిరికాయల పరిమాణంలో కంటే చాలా పెద్దగా ఉంటాయి.అడవులలో ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి వీటిని అడవి ఉసిరి అని కూడా అంటారు.ఈ ఉసిరిని పూర్వం నుంచీ ఋషులు , ఎంతో మంది ఆయుర్వేద వైద్యులు ప్రతీ అనారోగ్య సమస్యలో తప్పనిసరిగా వాడేవారని అందరికి తెలిసిన విషయమే.

 Image result for amla tree

కానీ వీటిద్వారా మార్కెట్ లో లభ్యమయ్యే సౌదర్య సాధనాలు లేక ఆరోగ్యాన్ని చేకూర్చే మందులు కొనుక్కుని మరీ తీసుకుంటాము కానీ వీటిని ఉపయోగించి ఇళ్లలోనే ఆరోగ్యాన్ని , సౌందర్యాన్ని కాపాడుకోవచ్చని చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు ఈ అడవి ఉసిరి  జ్యూస్ ని ఉపయోగించి సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు, మరింత మెరుగ్గా ఎలా చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం.

 Image result for amla juice benefits

కొన్ని అంటే ఐదు కి తగ్గకుండా ఉసిరికాయలు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత నీటిలోంచి తీసి ముక్కలు ముక్కలుగా కోసి మెత్తగా జ్యూస్ లా చేసుకోవాలి. ఇలా వచ్చిన జ్యూస్ ని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ నీటితో ముఖాన్ని రోజు కడుక్కుంటూ ఉంటే కొన్ని రోజులకి ముఖం ఎంతో బిగుతుగా ఆకర్షణీయంగా, కాంతివంతంగా  కనిపిస్తుంది. వృద్ధాప్య ముడతలని సైతం దూరం చేస్తుంది. అంతేకాదు చర్మంపై ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

 Image result for amla juice hair

ముఖంపై ఏర్పడే వైట్ హెడ్స్ లని తొలగించడంలో ఉసిరి నీటిని మించిన ఔషదం మరొకటి లేదనే చెప్పాలి,. ఈ నీరు రంధ్రాలలో పేరుకుపోయిన మడ్డిని తొలగించి ఎంతో శుభ్రపరుస్తుంది. అంతేకాదు జుట్టు ఊదిపోతుందని, ఒత్తుగా పెరగడం లేదని బెంగపడుతున్న వారు ఈ నీటిని తలపై కుదుళ్ళకి చేరేలా చేసి మసాజ్ చేసిన ఒక గంట తరువాత ఉసిరి పొడి, సీకాయ, లేక కుంకుడు తో తలంటు పోసుకుంటే జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా ఉంటుంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: