వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలం రోగాల రాకక అనువైన మార్గం అనే చెప్పాలి. అందుకు గల కారణాలు అనేకం ఉన్నా, ముఖ్యంగా మానవ తప్పిదాల వల్లనే వర్షాకాలం రోగాల కాలంగా మారిపోయింది. అయితే ఈ కాలం వచ్చిందటే ఎంతో మంది సరదాగా వర్షంలో గడుపుతారు. మనం రోజూ ఉండే పనుల రీత్యా బయటకి వెళ్ళిన సమయంలోనో మరే ఇతర కారణాల వలనో,  మన పాదాలు తడవడం  జరుగుతుంది. ఈ క్రమంలోనే నీటిలో నానిన పాదం అందం దెబ్బతింటుంది. అందుకే ఈ రైనీ సీజన్ లో పాదాల అందంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి అంటుంటారు నిపుణులు.

 Image result for rainy season foot care

వర్షాకాలంలో వీలు ఉన్నంత వరకూ షూ వేసుకోవడం ఎంతో ఉత్తమం. షూ వేసుకోక పొతే ల్ల వర్షంలో తడిసినపుడు ఎక్కువ సేపు తడి నిలిచి పాదాలకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాసం ఎక్కువగా  ఉంటుంది. అందుకు ఈ కాలంలో ఎక్కువగా షూ వేసుకునే బయటకి వెళ్ళడం మంచిది. ఒక వేళ వర్షంలో పాదాలు తడిచినట్లయితే ఇంటికి వచ్చిన తరువాత పాడాలని శుబ్రంగా కడుక్కోవాలి. అంతేకాదు కాలి వేళ్ళ మధ్య ఎక్కువగా తడి లేకుండా చూసుకోవాలి.

 Image result for rainy season foot care

రాత్రి సమయంలో పడుకునే ముందు, కాళ్ళకి ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనేని కానీ రాసుకోవచ్చు.  గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం, హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలియబెట్టి పాడాలని ఆ మిశ్రమంలో ఉంచాలి.  గోర్లని శుభ్రం చేసుకోవడానికి నిమ్మ చెక్కతో శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన పాదాల పగుళ్ళు రావు . అంతేకాదు షుగర్ వ్యాధిగ్రస్తులు వర్షాకాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్ పాదాలకి సోకకుండా జాగ్రత్త వహించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: