మ‌నం చేసే ప‌నిని బ‌ట్టి మ‌న చేతులు మృదుత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. బండ ప‌నులు చేయ‌డం, ఇంట్లో అంట్లు తోమ‌డం, ఇంటి ప‌ని, ఒంట ప‌ని చేసే విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించ‌కుండా, బండ‌గా ప‌ని చేస్తే అర‌చేతులు స్మూత్‌నెస్‌ను కోల్పోతూ ఉంటాయి. చేతులు తిరిగి స్మూత్‌గా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. ఇంట్లో దొరికే వ‌స్తువుల‌తోనే మ‌నం చేతులను స్మూత్‌గా చేసుకోవ‌చ్చు. ఈ స్మాల్ టిప్స్ ఏంటో ఈ కింద ఓ లుక్కేద్దాం.


చేతులు స్మూత్‌గా ఉండేందుకు పాటించాల్సిన టిప్స్ :
1 - ఒక కప్పు వేడి నీటిలో ఒక స్పూన్ వంట సోడా, ఒక స్పూన్ ఆలివ్ నూనె, నాలుగు చుక్కల పుదీనా నూనె కలిపి అందులో చేతులు మునిగేలా పది నిమిషాలు ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.


2- తేనే,కలబంద గుజ్జు స‌రిప‌డా తీసుకుని (రెండూ స‌మానంగా ఉండేలా చేసుకుని) ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి బాగా కలిపి చేతులకు స్క్రబ్ చేసి పావుగంట అయ్యాక గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. క‌నీసం వారానికి రెండు సార్లు చేస్తే చేతులు త‌మ స‌హ‌జ స్వ‌భావాన్ని తిరిగి పొందుతాయి.


3- రెండు బంగాళాదుంపలను ఉడకబెట్టి ఆ మిశ్ర‌మాన్ని మెత్త‌గా చేయాలి. అందులో రెండు స్పూన్ల బాదం నూనె, రెండు స్పూన్ల గ్లిజ‌రిన్ క‌లిపి ఈ మిశ్ర‌మం చేతుల‌కు రాసి... ఓ గంట అయ్యాక గోరు వెచ్చ‌ని నీళ్ల‌తో శుభ్రం చేస్తే చేతులు మృదువుగా మార‌తాయి.


4 - ఒక స్పూన్ తేనేకు నాలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి మృదువుగా స్క్రబ్ చేస్తే మృత కణాలు తొలగిపోతాయి.


5- ఎక్కువ వాట‌ర్ తీసుకుంటే కూడా శ‌రీరంలో ఉండే నీరు చేతుల‌ను మృదువుగా ఉంచేలా చేస్తుంది. స‌రిప‌డ వాట‌ర్ తీసుకోకుండా చేతులు ర‌ఫ్‌గా ఉంటాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: