ఆ నాటి కాలం నుంచి ఈ నాటి వ‌ర‌కు అందం విష‌యంలో ఏ ఒక్క‌రూ రాజీ ప‌డ‌రు. ఆ కాలంలోనివారు చాలా అందంగా.. గ్లామ‌ర‌స్ స్కిన్‌ క‌లిగి ఉండేవారు. ఆ క్లియ‌ర్ నెస్ వారి ఫోటోలు చూస్తేనే అర్థం అవుతుంది. ఆ కాలంలో ఎలాంటి మేక‌ప్ సామాగ్రి, బ్యూటీ క్రీములు, స్కిన్ ప్రొడ‌క్ట్స్ లాంటివి ఏమి లేవు. కానీ వారు ఇంట్లోని నేచుర‌ల్ ప‌దార్థాలతోనే వారి అందాన్ని ఎంతో కాంతి వంతంగా ఉంచుకునేవారు. ఇప్పుడు స‌హ‌జంగా చాలా మందిలో ఉండే స‌మ‌స్య డ్రై స్కిన్‌.. ఇలాంటి వారు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.


వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా మారితే జిడ్డు చ‌ర్మ‌త‌త్వం ఉన్న వారికి సంతోష‌మే. కానీ పొడి చ‌ర్మం ఉన్న వారు చాలా ఇబ్బంది ప‌డ‌తారు. చ‌లి కాలంలో వీరి చ‌ర్మం మ‌రింత పొడిగా, నిర్జీవంగా క‌నినిస్తుంది. డ్రై స్కిన్ ఉన్న‌వారు మ‌రీ వేడిగా ఉన్న‌ నీళ్ల‌తో స్నానం చేయ‌డం త‌గ్గించాలి. వేడినీళ్లు చ‌ర్మంపై ఉన్న స‌హ‌జ నూనెల‌ను తొలిగిస్తాయి. దీనితో చ‌ర్మం డ్రైగా మారే స‌మ‌స్య పెరుగుతుంది. స‌బ్బుల‌క‌న్న క్లేన్స‌ర్స్ లేదా ష‌వ‌ర్ జెల్‌ని రోజూ వారిడే చ‌ర్మం సున్నిత‌గా మార‌డంతో పాటు పొడిబార‌డాన్ని త‌గ్గిస్తాయి.


స్నానం చేసిన వెంట‌నే మంచి మాయిశ్చ‌రైజ‌ర్‌ని రాసుకోవాలి. ఇది ఒంట్లోని తేమ‌ను బ‌య‌ట‌కు పోనివ్వ‌కుండా కాపాడుతుంది. డ్రై స్కిన్ ఉన్నవారు ఎక్కువ శాతం నీరు త్రాగ‌డం మంచిది. వ‌ర్షాకాల‌మైనా, శీతాకాల‌మైనా క‌నీసం రెండు, మూడు లీట‌ర్లు నీళ్లు త్రాగాలి. చేప‌లు, వాల్ న‌ట్లు, ఒమేగా 3 ఆమ్లాలు పుష్క‌లంగా ఉండే ఆహార‌ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మానికి అవ‌స‌ర‌మైన స‌హ‌జ నూనెలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. అలాగే దీని వ‌ల్ల డ్రై స్కిన్ స‌మ‌స్య త‌గ్గుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: