వర్షాకాలంలో అందరూ ఎదుర్కునే ప్రధాన సమస్య చర్మంపై ఫంగస్ రావడం, దురదలు, చర్మంపై ఉన్న తడి ప్రదేశంలో చర్మం కందిపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో చర్మ సౌదర్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ రకమైన పరిస్థితి వర్షాకాలంలో ఎదుర్కోవడం సహజంగా జరుగుతుంది కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన తప్పకుండా ఉపశమనం పొందవచ్చు.

 Image result for rainy season eye care

ఈ సీజన్లో ముఖ్యంగా కళ్ళు, పాదాలు, మునివేళ్ళు దురదలు పెడుతూ ఉంటాయి. ఈ క్రమంలో గోళ్ళతో చర్మంపై రుద్దుతూ ఉపశమనం పొందుతాం కానీ ఈ సమయంలో చర్మం మొద్దు బారడం తో పాటు, ఎర్రగా మారి పుళ్ళు పడుతాయి. ఈ పరిస్థితుల నుంచీ ఉపశమనం పొందాలంటే కొన్ని పద్దతులు పాటించక తప్పదు. ఈ పద్దతుల వలన సమస్యల నుంచీ ఉపశమనం పొందటమే కాకుండా సౌందర్యం కూడా మెరుగు పడుతుంది.

 Image result for rainy season eye care

సున్నితమైన ప్రదేశాలలో దురద వచ్చినప్పుడు కీరదోస రసం,  క్యారెట్ రసం రెండూ కలిపి అందులో కాటన్ ముంచి దాన్ని కళ్లపై పెట్టుకోవాలి. పది నిమిషాలు ఇలా చేస్తే కళ్ళకి ఉండే మంటలు తగ్గుతాయి, దురదలు కూడా తగ్గుతాయి. ఈ కాలంలో బయట నుంచీ ఇంట్లోకి వచ్చిన తరువాత శరీరంపై తడి ప్రదేశాన్ని బాగా ఆరబెట్టుకోవాలి. జుట్టుపై తడి లేకుండా చూసుకుని సాంబ్రాణి పెట్టుకుంటే తలపై తడి వలన వచ్చే కురుపులు కానీ, చుండ్రు కానీ రాకుండా కాపాడుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: