ఈ కాలంలో చాలా మందికి పాదాల ప‌గుళ్లు రావ‌డం సాధార‌ణంగా ఉంటుంది. దీనికి కార‌ణాలు అనేకం. అయితే ప‌రిష్కార మార్గాల కోసం ఎంతో ఖ‌ర్చు పెట్ట‌డం, ప‌రిస్థితిలో మార్పు రాలేద‌ని బాధ‌ప‌డ‌టానికి ఇక స్వ‌స్తి ప‌ల‌కండి.  ఇంట్లోనే ల‌భ్య‌మ‌య్యే వ‌స్తువుల‌తో ఈ ప‌గుళ్ల‌కు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..


- రెండు మూడు చెంచాల బియ్యాన్ని మిక్సీలో వేసి పొడి చేయాలి. ఇందులో కాస్త తేనె, వెనిగ‌ర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు రాయ‌డం వ‌ల‌న ప‌దాలు మృదువుగా మార‌తాయి.


- అర‌క‌ప్పు గోరువెచ్చ‌ని నీటిలో ప్యాకెట్ షాంపూ, నాలుగు చెంచాల ఆలీవ్‌నూనె వేసి క‌ల‌పాలి. ఇందులో పాదాల‌ను పావుగంట పాటు నాన‌బెట్టి త‌ర్వాత శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాదాలు ప‌గ‌ల‌కుండా ఉంటాయి.


- కీర‌దోస‌ను, బంగాళ‌దుంప‌ని క‌లిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల‌న ప‌గుళ్లు త‌గ్గుతాయి.


- అర‌టిపండుని మెత్త‌గా గుజ్జులా చేసి, అందులో కొంచెం తేనె. రోజ్‌వాట‌ర్ క‌లిపి ప‌గుళ్లు ఉన్నచోట త‌రుచూ రాస్తే ప‌గుళ్లు, వాటి వ‌ల్ల క‌లిగే నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.


- చెంచాడు నిమ్మ‌రసంలో కొద్దిగా పెట్రోలియం జెల్లీ క‌లిపి పాదాల ప‌గుళ్ల‌కు రాయాలి. రాత్రంతా పాదాల‌ను అలా ఉంచుకుని ఉద‌యం క‌డిగేసుకోవాలి. ఇలా వారం, ప‌దిరోజులు చేయ‌డం వ‌ల్ల ఫ‌లితం క‌నిపిస్తుంది.


- గుప్పెడు వేపాకుల‌ను మెత్త‌ని పేస్ట్‌లా చేయాలి. ఇందులో మూడు చెంచాల ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు ప‌ట్టించి అర‌గంట త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క‌డ‌గాలి. దీని వ‌ల్ల మంచి రిజ‌ల్ట్ పొందుతారు. 


- ఇక పాదాల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కూ పొడిగా ఉంచుకోవాలి. ఈ జాగ్ర‌త్త‌ల‌తో పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవ‌చ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: