బాదం పప్పును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బాదంలో చాలా పోషకాలు ఉంటాయి, ముఖ్య పోషకపదార్థాలైన ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా-6 ఫ్యాటీయాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కరిగే మరియు కరగని పీచు పదార్థాలు ఎన్నో ఉంటాయి. రక్తపోటున్నవారికి బాదంపప్పు చాలా ఉపయోగకరం ఎందుకంటే ఇవి నాడీ మరియు కండరాలు మెరుగ్గా పనిచేయటానికి సాయపడతాయి. అలాగే బాదంతో ఆరోగ్య‌మే కాదు.. అందం కూడా..  వాటి ద్వారా అందాన్ని పెంపొందించుకోవొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..


- బాదంపప్పును రాత్రంతా బాగా నానబెట్టాలి. తర్వాత ఆ పొట్టును తీసివేయాలి. దాన్ని మిశ్రమంగా చేసుకోవాలి. ఒక టీ స్పూన్ బాదం పప్పు మిశ్రమానికి కాస్త నిమ్మరసం కలపండి. దాన్ని ఫేస్ కు అప్లై చేసి కొద్ది సేపటి తర్వాత  ఫేస్ క్లీన్ చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ముఖం మొత్తం కాంతివంతంగా మారి వెలిగిపోతుంది. 


- బాదం నూనె కూడా ఫేస్ అందాన్ని పెంచగలదు. అందులో ఉంటే ఏ, ఈ విటమిన్స్ చర్మంపై ఉండే దుమ్ముధూళి మొత్తాన్ని తొలగిస్తుంది. బాదంనూనె, కొబ్బరి నూనె కలుపుకుని ముఖంపై డ్రై గా ఉండే ప్రాంతంలో లేదంటే కాస్త నల్లగా ఉండే ప్రాంతంలో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


- రోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాసుకోండి. కొన్ని రోజుల్లో మీ ముఖంలో కొత్త కాంతి కనపడుతుంది. ఇక బాదం నూనెలో కాస్త నిమ్మరసం వేసి ఫేస్ కు పూసుకుంటే కూడా చాలా మేలు.


- కొన్ని కాఫీ గింజలను బాగా పొడి చేసుకుని అందులో కాస్త బాదం పాలు కలుపుకుని దాన్నిముఖానికి రాసుకోవాలి. కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మీ ఫేస్ అందంగా తయారవుతుంది.


- బాదం పౌడర్‌ లో పాలను కలుపుకుని ఫేస్ కు రాసుకుంటే ముఖంపై ఉన్న దుమ్మును పోగొట్టి, దురద వంటి సమస్యల‌ను పోగొడుతుంది. 


- బాదం, ఆముదం కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు నిగనిగలాడుతుంది, జుట్టు  రాల‌కుండా స‌హాయ‌ప‌డుతుంది, బలంగా ఉంటుంది. 


- అలాగే కాస్త బాదం నూనెలో తేనె క‌లిపి క‌ళ్ల కింద ఉన్న న‌ల్ల‌టి వ‌ల‌యాల‌పై అప్లై చేస్తే వాటిని దూరం చేయ‌డంలో తోడ్పడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: