కీరాదోశ‌కాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎటువంటి ఫ్యాట్ లేకుండా మంచి ఆహారంగా ప‌రిగ‌ణిస్తారు. ఇది తిన‌డంవ‌ల్ల మ‌న జీర్ణాశ‌యంలో ఉండే స‌మ‌స్య‌లు కూడా తొల‌గిపోతాయి. అయితే ఇప్పుడు ఇది కేవ‌లం తిన‌డానికికే కాకుండా దీనితో కొన్ని సౌంద‌ర్యానికి కూడా ఉప‌యోగిస్తున్నారు.


1. గంధం పొడి, పసుపు, రోజ్ వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే శరీర ఛాయ మెరుగుపడుతుంది. ఎండకు నల్లగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది.


2. ముల్తానీ మట్టిలో చెంచా బంగాళదుంప గుజ్జు, నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పావుగంట అయ్యాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం తాజాగా తయారవుతుంది.


3. అర టీ స్పూను కీర రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్లకు రాసుకుని అరగంట సేపు ఉంచి చల్లని నీళ్లతో కడిగేస్తే కళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి.


4. టమోటా గుజ్జు ఒక టీ స్పూను, పెరుగు ఒక టీ స్పూను, రోజ్ వాటర్ అర టీస్పూను... బాగా కలిపి ముఖం, మెడపై రాసుకోవాలి. పరిహేను నిమిషముల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కుని, ఆ తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మం కాంతివంతంగా ఉంటుంది.


5. నిమ్మ రసంలో రోజ్ వాటర్ కలిపి రాత్రి వేళ పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. ఇలా కొద్ది రోజులు క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై మొటిమలు తొలగిపోతాయి.


6. రెండు టీ స్పూన్ల పసుపులో టీ స్పునూ రోజ్ వాటర్ కలిపి పేస్టు చేసి, ముఖం పై అప్లై చేసుకుని ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి. అలాగే కీరదోస రసంలో రోజ్ వాటర్, గ్లిజరిన్ చుక్కలు వేసి ముఖానికి రాసుకుంటే చర్మం నునుపుదనాన్ని సంతరించుకుంటుంది.


నోట్ః ప‌సుపు వేసుకునేట‌ప్పుడు చాలా త‌క్కువ వేసుకోవాలి. దానివ‌ల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది. అంతేకాక ఎక్కువ వేయ‌డం వ‌ల్ల ముఖం ముదురుగా త‌యార‌వుతుంది. చిటికెడు మాత్ర‌మే ప‌సుపువాడాలి.  అంతేకాక కీర మ‌నం తిన్నా మ‌న శ‌రీరం పైన వివిధ‌ర‌కాల్లో అప్లై చేసిన అది చాలా చ‌లువ‌చేసే ప‌దార్ధం.


మరింత సమాచారం తెలుసుకోండి: