ఒకప్పుడు ఉదయాన్నే లేచి జాగింగ్ చేయడం అంటే బద్ధకం.  ఉదయాన్నే లేచి పరుగులు తీయడమా ఏం అవసరం లేదులే అనుకునేవారు.  ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.  ప్రతి ఒక్కరు ఫిట్ గా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  


ముఖ్యంగా యువత.  ఉదయం లేచిన వెంటనే జిమ్ కు వెళ్లడం..గంటల తరబడి వర్కౌట్ చేయడం వంటివి చేస్తున్నారు.  ఇలా చేయడం వలన బాడీ ఫిట్ గా ఉంటుంది.  పైగా ఇప్పుడు అమ్మాయిలు కూడా ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.  స్లిమ్ గా ఉండాలని, నాజూగ్గా కనిపించాలని కోరుకుంటున్నారు.  


దానికి తగ్గట్టుగానే పార్టనర్ కూడా ఫిట్ గ ఉండాలని అనుకుంటున్నారు. ఫిట్నెస్ లేకుండా పొట్ట ఉండే అబ్బాయిలను అమ్మాయిలు లైక్ చేయడం లేదు.  అదే విధంగా అబ్బాయిలు కూడా ఇలానే ఆలోచిస్తున్నారు.  దాదాపుగా ప్రతి ఒక్కరు ఎదో ఒక సమయంలో వర్కౌట్ చేస్తూ సారైనా ఆహారం తీసుకుంటూ ఫిట్నెస్ తో ఉండేందుకు ట్రై చేస్తున్నారు.  


ఫిట్నెస్ పై ఎందుకు అంత శ్రద్ద చూపిస్తున్నారు అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది.  ఫిట్ గా ఉంటె..యాక్టివ్ గా ఉండొచ్చు.  యాక్టివ్ గా ఉంటె ప్రతి పనిని పర్ఫెక్ట్ గా చేయడానికి స్కోప్ ఉంటుంది.  అంతేకాదు, ఫైనల్ గా సెక్సుల్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుందని అందుకే ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్టు యువత పేర్కొంటోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: