ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి క్యారెట్స్. విటమిన్ ఏ పుష్కలంగా ఉండే క్యారెట్స్ ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్యవంతమైన చర్మానికి విటమిన్ ఏ చాలా అవసరం. ఇందులో ఉండే అనేకరకాల పోషకాలు చర్మ సంరక్షణకు తోడ్పడతాయి. క్యారెట్ ఆరోగ్యానికే కాకుండా ముఖంపై వ‌చ్చే కొన్ని ర‌కాల స‌మ‌స్య‌ల‌ను పోగొట్ట‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఆహారంగా తీసుకోవడమే కాకుండా.. క్యారెట్స్‌తో ఫేస్‌ప్యాక్స్‌ వేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయని మీకు తెలుసా ?


నేచురల్‌గా మొటిమలు, మచ్చలు, వైట్ హెడ్స్, పిగ్మెంటేషన్, సన్ టాన్ నుంచి క్యారెట్స్ రక్షణ కల్పిస్తాయి. క్యారెట్ తో ఫేస్ ప్యాక్ లు ఇంట్లోనే తయారు చేసుకుని అప్లై చేసుకోవడం వల్ల మరింత అందంగా.. ఆకర్షణీయంగా కనిపింవచ్చు.


- రెండు క్యారెట్ల‌ను పేస్టులా చేసుకుని, అందులో ఐదారు చెంచాల పాలు క‌లిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన ముఖానికి ప్యాక్ తొలిగించి, ముఖానికి అవిరిప‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ్లాక్‌హెడ్స్ వైట్‌హెడ్స్ త‌గ్గ‌పోతాయి.


- పొడిచర్మంతో బాధపడేవాళ్లకు క్యారెట్ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది. టేబుల్‌ స్పూన్‌ క్యారెట్‌ జ్యూస్‌, టీ స్పూన్‌ తేనె తీసుకుని మిక్స్‌ చేయాలి. ఈ పేస్ట్ ని ఫేస్‌కు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల ముఖవర్చస్సు పెరుగుతుంది.


- క్యారెట్‌, బొప్పాయి రెండింటిని సమానంగా తీసుకుని పేస్ట్‌ చేసుకోవాలి. ఇందులోకి తగినన్ని పాలు కలిపి పేస్ట్‌ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.


- క్యారెట్‌ను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి అందులో కొద్దిగా తేనె, పాలు చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఐదు నిముషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడమే కాదు.. వాటి తాలూకు మచ్చలు కూడా మాయమవుతాయి.


- క్యారెట్ జ్యూస్, అరటిపండు గుజ్జు, ఎగ్ వైట్ అన్నింటిని రెండు రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. వీటికి 4 చుక్కల నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ తరచుగా వాడటం వల్ల చర్మ సమస్యలు దూరమై అందంగా కనిపిస్తారు.


- క్యారెట్‌ పేస్ట్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు తీసుకుని బాగా కలపాలి. ఇందులో ఒక టీ స్పూన్‌ సెనగపిండి, కాస్త పసుపు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. తరచుగా ఈ ఫేస్‌ప్యాక్‌ను వాడుతుంటే చర్మ కాంతి పెరుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: