చాలా మంది చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. కానీ వారి పాదాలు మాత్రం పగుళ్లతో అందవిహీనంగా తయారవుతాయి. పైకి ఎంత అందంగా ఉన్నాసరే పాదాల పగుళ్ళు కన్పించే సరికి వారి ఒక్క సారిగా ఆవిరియ్యిపోతుంది. అలాంటి వారు తమ పాదాలు కనపడకుండా ఉండేందుకు రకరకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ పాదాల పగుళ్ళు రాకుండా ఉండాలంటే అసలు పాదాలకి పగుళ్ళు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే చాలు, సమస్య యిట్టె పరిష్కారం అవుతుంది.

 Related image

ఇంతకీ పాదాలకి పగుళ్ళు ఎందుకు వస్తాయనంటే. శరీరంలో ఉండే అధిక వేడిమి కారణంగా , పొడి చర్మం, ఎక్కువ సేపు నిలబడి పనులు చేసేవారికి పాదాలకి పగుళ్ళు ఏర్పడుతాయి. ఎత్తు మడం చెప్పులు వేసుకునే వారికి కూడా ఈ రకమైన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అంతేకాదు పోషక ఆహార లోపం ఉన్న వారికి కూడా పాదాల పగుళ్ళు ఏర్పడుతాయి. ఈ పగుళ్ళు ఏర్పడిన వారు సాక్సులతో  పాదాలని దాచుకుంటారు. ఇలాంటి పరిస్థితిలు రాకుండా ఉండాలంటే. సరైన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అందుకోసం న్యాచురల్ పద్దతులని పాటిస్తే సరిపోతుంది.

 Image result for feet cracks turmeric

న్యాచురల్ రెమిడీస్ కి కావాల్సిన పదార్ధాలు. ఒక నిమ్మకాయ, ఉప్పు, పసుపు.

ముందుగా నిమ్మకాయని ఒక గిన్నెలో రసం తీసుకుని ఉంచుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసి, బాగా కలిపిన తరువాత, ఒక స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమంని పగిలిన పాదాలకి పట్టించి మర్దనా చేయాలి. అరగంట సేపు ఆరనిచ్చి గోరు వెచ్చని నీటితో శుభ్రపరచాలి. పసుపులో యాంటీబయాటిక్ కారకాలు ఉండటం వలన తొందరగా పాదాల మధ్య ఉన్న ఇన్ఫెక్షన్ ని నివారిచి, పగుళ్ళు మాయం అయ్యేలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మరుగైన ఫలితాలని పొందవచ్చు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: