సహజంగా మనం రోజు లేవగానే టీ తాగుతాం, కొంతమంది కాఫీ, గ్రీన్ టీ , లెమన్ టీ, బాదం టీ, ఇలా రకరకాల టీ లు తాగుతారు. అయితే వీటివల్ల ఎంతవరకూ ఆరోగ్యం, అందం ఎంతవరకూ కాపాడ పడుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. కానీ అటు ఆరోగ్యం, ఇటు అందం రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ శరీరానికి మేలు చేసే అత్యుత్తమ టీ మాత్రం పూర్వం నుంచీ మనిషి నిత్య క్రుత్యంలో ఒకటిగా అయ్యింది. కానీ కాలక్రమేణా అది కనుమరుగయ్యింది. ఇప్పుడు ఆయుర్వేదం మళ్ళీ ఈ ఫాస్టెస్ట్ కాలంలో ప్రాచుర్యం పొందుతోంది కాబట్టి మళ్ళీ ఈ టీ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏమిటీ టీ దీనివల్ల ఉపయోగాలు ఏమిటి అనే వివరాలలోకి వెళ్తే...

 Image result for methi tea

మనిషికి దైనందిక కార్యక్రమాలో అలుపు లేకుండా, జీవితం సాఫీగా సాగిపోతోంది. మధుమేహంతో ప్రతీ ఒక్కరూ బాధపడిపోతున్నారు. కాలుష్యం బారిన చర్మం జీవం లేకుండా పోయి అందం కోల్పోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. షుగర్ భాదితులు తరచూ చెకప్ ల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే పూర్వీకులు నిత్యం సేవించే మెంతి టీ మళ్ళీ వెలుగులోకి వచ్చింది.

 Image result for methi tea

మెంతి గింజలతో చేసే టీ తో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడమే కాకుండా మధుమేహం లేని వారు ఈ టీ ని తాగడం వలన స్థూలకాయం నుంచీ విముక్తి పొందుతారు. అంతేకాదు, చక్కనైన శరీరాకృతి కూడా సొంతం అవుతుంది, దానితో పాటు శరీర చర్మం నునుపుగా మారడంలో ఈ టీ కీలక పాత్ర పోషిస్తుంది. కడుపునొప్పితో ఇబ్బంది పడే వారికి ఉపశమనం కోసం ఇది ఎంతగావు ఉపయోగ పడుతుంది. కిడ్నీలో సమస్యలు ఉన్నా సరే వాటిని దూరం చేస్తుంది. మరి ఈ టీ ఎలా చేయాలో చూద్దామా.  ఒక స్పూను మెంతి గింజలు తీసుకుని, పొడి చేసుకుని, తగినన్ని నీళ్ళు తీసుకుని అందులో ఈ పొగి వేసి బాగా మరగ పెట్టాలి. ఈ మరిగే నీళ్ళల్లో తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు. ఇలా తయారైన టీ ని ఐదు నిమిషాలు ఉంచి త్రాగితే మంచి ఫలితాలని పొందవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: