మనిషి ఎంత అందంగా ఉన్నా ఆ అందాన్ని చూడాలంటే కళ్లు ఉండాలి. అయితే కళ్ల అందం కోసం మనం ఎన్నో జాగ్రత్తలు పడుతుంటాం. కళ్ల సౌందర్యాన్ని పెంచే మేకప్‌ సాధనాలు మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. కానీ ఎలాంటి మేకప్‌ లేకుండానే కళ్లు మరింత ఆకర్షణీయంగా కనబడితే మంచిదే కదా..! మేకప్‌ నిపుణులు అందిస్తున్న ఈ చిట్కాలతో సౌందర్య సాధనాలు వాడకుండానే కళ్లు సౌందర్యంగా, ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంటాయి. 


- చల్లని నీళ్లను కళ్లు, మొహంపై చల్లుకోవడం వలన కళ్లు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటాయి. ఊరికే కడగడమే కాకుండా కాస్త ఎక్కువ సమయం ఇలా చేయడం వలన మరింత ప్రయోజనం ఉంటుంది. 


- చల్లని టీ బ్యాగులను కంటిరెప్పలపై ఉంచడం వలన కంటి చుట్టూ చర్మం బిగుతుగా మారుతుంది. నిద్రలేని కళ్లు నిర్జీవంగా కనబడతాయి. ఎనిమిది గంటల నిద్ర, కంటికి విశ్రాంతి ఉంటే కళ్లు అలసటగా కనిపించవు. 


- గిన్నెలో చల్లటి నీరు తీసుకోండి. అందులో విటమిన్ ఇ ఉండే ఆయిల్ ను కొన్ని చుక్కలు వేయండి. అందులో దూది ముంచి దానిని కళ్లపై 20 నిమిషాల సేపు ఉంచుకోవాలి. 


- ఎక్కువ మంచినీళ్లు తాగటం, పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు తగినంత తీసుకోవడం తప్పనిసరి.


- కనురెప్పలకు కాస్త పెట్రోలియం జెల్లీని రాయడం వలన అవి నిగనిగలాడతాయి. కళ్లు మూసి రెప్ప పైభాగంలో ముఖానికి రాసే ఫేస్‌ క్రీమ్‌ రాయడం ద్వారా ఆ భాగంలో చర్మం మెరుస్తుంది.


-  కళ్లు అలసిపోయినట్లు ఉంటే చల్లటి పాలలో దూది అద్ది వాటిని కళ్ల మీద ఉంచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కంటికి అల‌స‌ట పోయి ఆక‌ర్ష‌వంతంగా క‌నిపిస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: