చర్మం ప్రకాశవంతంగా, మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద పెడుతూ ఉంటారు. అందుకోసం రకరకాల బ్యూటీ ప్రాడక్ట్స్ కొనుగోలు చేస్తారు. వాటిలో రసాయనిక పదార్ధాలు మిళితం అవడంతో వాటివల్ల చర్మ మెరవడం ఏమో కానీ చర్మం క్రమక్రమంగా పాడవుతుంది. పోనీ సహజసిద్దమైన బ్యూటీ ప్రాడక్ట్స్ కొనుగోలు చేద్దామా అంటే ధరలు చుక్కలు చూపిస్తాయి.

Image result for oats for skin

అందుకే ఇంట్లోనే సహజసిద్ధంగా దొరికే పదార్ధాలతోనే మెరిసే చర్మం సొంత చేసుకోవచ్చు. మరి అందుకు ఏ ఏ పదార్ధాలు కావాలి, వాటిని ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం..అరటి పండు, రెండు చెంచాల ఓట్స్, తేనే ఒక చెంచా...అయితే ఓట్స్ ని పొడిగా చేసుకోవాలి. (ఓట్స్ చర్మంపై ఉండే జిడ్డుని, మలినాలని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది). ఆ తరువాత ఈ పదార్ధాలు అన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి.

Image result for oats for skin

ఆ తరువాత ముఖాన్ని ముందుగా  చల్లని నీటితో శుభ్రంగా కడుక్కుని, తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 10 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తప్పకుండా నిగారించే చర్మం మీ సొంతం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: