స‌హ‌జంగా చాలా మందికి కనీసం ఫేస్ కూడా వాష్ చేసుకోవడానికి కూడా తీరిక ఉండదు. మీరు ఎంత బిజిగా ఉన్నా సరే కచ్చితంగా కాస్త మీ చర్మ సంరక్షణపై ద్రుష్టిపెట్టండి. అలాగే వ‌ర్షాకాలంలో చాలా ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటాం. దీనికి రోజూ ఉదయం రాత్రి కొన్ని రకాల టిప్స్ పాటిస్తే మీ అందం ఎప్పటికీ చెరగకుండా ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏమిటో ఒక్కసారి చూడండి.


- ఉదయం లేచిన తర్వాత కొద్ది సేపటికి ముఖాన్ని ఖ‌చ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రాత్రంతా ముఖంపై పేరుకుపోయిన జిడ్డు పోతుంది. అలాగే బ్యాక్టీరియా మొత్తం కూడా పోతుంది. ముఖానికి కావాల్సిన రక్తప్రసరణ అందుతుంది.


- ఆపిల్ పండు తీసుకుని దాన్ని తొక్క మొత్తం తీసి తర్వాత దాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోండి. అందులో కాస్త తేనే కూడా కలపండి. ఆ పేస్ట్ ను మీ ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల త‌ర్వాత వాష్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. 


- బాగా మాగిన అరటిపండు తీసుకోండి. దాన్ని మిక్సీలో వేసి బాగా పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దానికి కాస్త తేనె, కాస్త పెరుగు కలిపి ఫేస్‌కు అప్లై చేస్తే ముఖం నిగారింపుగా క‌నిపిస్తుంది.


- బొప్పాడు పండు తీసుకుని దాన్ని తొక్క తీసి వేసి ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. కాస్త తేనె, నిమ్మకాయరసాన్ని కలుపుకోండి.  దాన్ని మీ ముఖం మీద రాసుకుని త‌ర్వాత వాష్ చేస్తే మంచి టోన్ వ‌స్తుంది.


- బాగా మాగిన టమాటాల నుంచి రసం తీసి అందులో కాస్త పసుపు, పెరుగు కలిపి ముఖానికి రాసుకోండి. కొద్ది సేపటి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల కూడా మీ చర్మానికి కాంతివంతంగా మారుతుంది.


- ఆరెంజ్ పండు ఎండిన తొక్క‌ల‌ను తీసుకుని పొడి చేసి అందులో టీ స్పూన్ ఓట్ మీట్ మిక్స్ చేసి అందులో కొంచెం తేనే, పెరుగు క‌లిపి ఫేస్‌కు అప్లై చేయాలి. 15 నిమిషాల త‌ర్వాత వాష్ చేస్తే ముఖం ఎంతో అందంగా మారుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: