చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఉపయోగించే సౌందర్య ఉత్పత్తుల్లో ముందు ఉండే పెరుగు. పెరుగును చర్మానికి అప్లై చేస్తే అన్ని రకాల చర్మ సమస్యలను తొలగిపోతాయి. ఎందుకంటే పెరుగులో ఉండే విటమిన్ సి, ల్యాక్టిక్ యాసిడ్, క్యాల్షియం, వంటి అనేక ప్రయోజనాలు చర్మ మీద పనిచేసి మీ చర్మం అందంగా , ఫ్రెష్ గా కనబడుటకు సహాయపడుతుంది. ఈ ట్రెడిషినల్ స్కిన్ కేర్ కాంపోనెంట్ అందాన్ని మెరుగుపరుచుకోవడంలో ఒక అద్భుతమైన ప్రొడక్ట్. అందుకే తప్పనిసరిగా దీన్ని తీసుకోవాలి. 


అలాగే పెరుగులో ఎంటి హానికర కెమికల్స్ ఉండవు . అందుకే పెరుగును చర్మ అందానికి నిరభ్యరంతంగా ఉపయోగించుకోవచ్చు. పెరగులో వివిధ రకాల బ్యూటీ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..


- ఒక టీ స్పూన్ పెరుగులో కొంచెం తేనె వేసి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫేస్‌కు అప్లై చేసి 15 నిమిషాల త‌ర్వాత వాష్ చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమల సమస్య తగ్గుతుంది.


- ఒక టీస్పూన్ పెరుగును , ఒక టీ స్పూన్ కీరదోసకాయ పేస్ట్ కు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కాసేప‌టి త‌ర్వాత వాష్ చేయ‌డం వ‌ల్ల చర్మంలో డల్ నెస్ తగ్గిస్తుంది.


- టీస్పూన్ పెరుగులో ½ టీస్పూన్ శెనగపిండి వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ను మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా వారానికొకసారి ట్రై చేస్తే చర్మంలో ఎలాంటి మచ్చలు లేకుండా క్లియర్ స్కిన్ అందిస్తుంది.


- పెరుగులో ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల త‌ర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మంలో జిడ్డు తత్వం తగ్గుతుంది.


- పెరుగులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు ప‌ట్టించి కొంత స‌మ‌యంతో త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. దీని వ‌ల్ల డార్క్ స్పాట్స్ పూర్తిగా తొలగిపోతాయి.


- టీస్పూన్ ఫ్రెష్ పెరుగు ఎగ్ వైట్ ను మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫేస్‌కు అప్లై చేసి 20 నిమిషాల త‌ర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల యంగర్ లుక్ మీ సొంతం చేసుకుంటారు.


- పెరుగులో అలోవెరజెల్ వేసి బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. దీని వ‌ల్ల బ్లాక్ హెడ్స్ సమస్య ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: