స‌హ‌జంగా గులాబీ రేకుల్లాంటి రంగులో, మృదువైన పెదవులు కావాలని అందరూ కోరుకుంటారు. అందమైన ముఖానికి అందాన్నిచ్చే పెదవులు వాతావరణ మార్పుల వల్ల తరచూ పొడిబారుతుంటాయి. ఈ సమస్యను గుర్తించి ఎప్పటికప్పుడు పెదవుల పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గులాబీ రేకుల్లా కోమలంగా ఉండాల్సిన పెదవులు గులాబీ ముళ్ళలా మారి ఇబ్బంది పెడతాయి. నిజానికి పెద‌వుల్లో తేమ త‌గ్గిపోవ‌డం వ‌ల్ల పెద‌వులు డ్రై అయిపోయి, న‌ల్ల‌గా మార‌డంతో అంద‌హీనంగా క‌నిపిస్తాయి. వీటి నుంచి బ‌య‌ట ప‌డాలంటే కొన్ని సులువైన చిట్కాలు పాటిస్తే స‌రిపోతుంది. అవేంటో ఓ సారి లుక్కేయండి..


-  పొడిగా మారడాన్ని, పగలడాన్ని తగ్గించే గుణాలు కలబంద రసంలో కావాల్సినన్ని ఉన్నాయి. రాత్రంతా కలబంద రసాన్ని రాసుకుంటే సమస్య తగ్గిపోతుంది. 


- పచ్చి బంగాళాదుంప ముక్కల్ని పెదవులకు రాసుకుంటే పెదవులు మెత్తబడటమే కాకుండా.. నల్లని పెదవులు గులాబీ రంగుకు మారతాయి.


-రోజూ పడుకోవడానికి ముందు టీస్పూను ఆలివ్ ఆయిల్‌ను పెదాలపై మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే పడుకుని ఉదయాన కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులు తేమవంతంగా మారుతాయి. 


-  ఒక టీస్పూను తేనెలో, అర టీస్పూను పంచదార కలిపి ఆ మిశ్రమంతో పెదవులపై రుద్దాలి. మృతకణాలన్నీ పోయి పెదవులు శుభ్రపడతాయి. 


- బిరుసెక్కిన పెదవులకు లిప్‌స్టిక్ రాసేముందు పాలలో ముంచిన దూదితో పెదవులను తుడిచి లిప్‌స్టిక్ రాస్తే పెదవులు నిగారించినట్లు కనిపించడమే కాకుండా ఎక్కువసేపు ఆ మెరుపు ఉంటుంది.


- లేత కీరా దోసముక్కతో తరచూ రుద్దితే కూడా పెదవులకు తగినంత తేమ అందుతుంది.


-  బీట్‌రూట్ ముక్కని పెదాలపై బాగా రుద్దాలి. రాత్రంతా అలా వదిలేసి, ఉదయం కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ పెదవులు సహజంగానే గులాబీ రంగులోకి మారతాయి. 


- గులాబి రేకులు, తేనె కలిపి మెత్తని పేస్టులా చేయాలి. ఆ పేస్టుని పెదవులపై రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. 


- గ్రీన్ టీ బాగ్‌ను గోరువెచ్చటి నీటిలో ఐదు నిముషాలు ముంచి తీసి బిరుసెక్కిన పెదవులపై ఉంచితే గొప్ప ఉపశమనంతో పాటు పెదవులు మెత్తబడతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: