అందంగా, ఆకర్షణీయంగా కనపడటానికి పడరాని పాట్లు పడుతాం. ఆ కాస్మోటిక్స్, ఈ జెల్స్ అంటూ రకరకాల ఉత్పత్తులు వాడుతూ ఉంటాం. వీటివలన చర్మం పాడవటమే కాకుండా, సైడ్ ఎఫ్ఫెక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  అయితే మన వంటింట్లో అందుబాటులో ఉండే  వాటితోనే  అందాన్ని కాపాడుకోవచ్చు, మరింత మెరుగు పరుచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

 Related image

వంటిట్లో ఆరోగ్యానికి,అందానికి  సంభందించిన పదార్ధాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది మెంతులు. ఈ మెంతులతో అందాన్ని మెరుగు పరచడమే కాకుండా చర్మ సంభందిత వ్యాధులని సైతం దూరం చేయవచ్చు. మొటిమలు, నల్లటి మచ్చలు కూడా మెంతులతో నివారించవచ్చు.  ముందుగా మెంతి పొడిని తీసుకుని అందులో సరిపడా స్వచ్చమైన పసుపు, దోసకాయ గుజ్జు కలపాలి. ఇదే మిశ్రమంలో కొబ్బరి నీళ్ళు, సున్నం నీళ్ళు కలిపి గుజ్జులా చేసుకోవాలి.

 Image result for fenugreek face pack

ఇలా గట్టి ముద్దలా వచ్చిన పేస్ట్ మిశ్రమాన్ని ముఖానికి చేతి వేళ్ళతో బాగా పట్టించాలి. పట్టించే విధానం కూడా వేళ్ళతో మృదువుగా రుద్దుతూ చేయాలి, ఎందుకంటే ముఖంపై ఏర్పడిన బ్లాక్ హెడ్స్ , రంధ్రాలు వంటి వాటిని నివారించాలంటే ముఖానికి బాగా పట్టించాల్సిందే. సుమారు ఒక అరగంట పాటు బాగా ఆరనిచ్చి, గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగేయాలి. ఇలా వారానికి రెండు మార్లు, ఒక రెండు నెలల పాటు చేస్తే తప్పకుండా మీ ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా చర్మం పాడవకుండా ఉంటుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: