స‌హ‌జంగా ఎవ‌రికైనా తాము అందంగా క‌నిపించాల‌ని కోరిక ఉంటుంది. అయితే పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న‌ది అందరికీ తెలిసిందే. వాటిని తాగ‌డ‌మే కాకుండా అప్పుడప్పుడు చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మెరిసే మేని ఛాయ మన సొంతం అవుతుంది. చాలామంది మహిళలు ఎండలోకి వెళ్లినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోరు. దీంతో ఎండ పడిన చోట చర్మం కమిలిపోయి నల్లగా, ఎర్రగా మారుతుంది. ఇలాంటి ఎన్నో చ‌ర్మ  సమస్యకు పాలతో చెక్ పెట్ట‌వ‌చ్చు. అది ఎలాగో ఓ సారి లుక్కేయండి..


- ముందుగా శుభ్ర‌మైన‌  తెల్లటి, పల్చటి కాటన్ వస్త్రాన్ని పాలలో ముంచి ఆ వస్త్రాన్ని ముఖంపై ఐదు నిమిషాలపాటు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాదు కాంతివంతంగా మారుతుంది.


- పాల‌లో కొంచెం నిమ్మ ర‌సం క‌లిపి ముఖానికి రాసుకొవాలి. 20 నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి టోన్ పొంద‌వ‌చ్చు.


- బొప్పాయి మొక్కలు, పాలు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది.


- పాల‌లో కొంచెం తేనెను క‌లిపి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ముఖంపై మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి.


- పాలు ముఖానికి వేసుకొనే మేక‌ప్‌ను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. దూదిని తీసుకుని పాలలో ముంచి ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల  చర్మంపై ఉన్న మ‌లినాలు తొల‌గిపోతాయి.


- ముల్తాని మట్టిలో కొంచెం పాలు మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకోవ‌డం వ‌ల్ల ముఖం నిగారింపుగా ఉంటుంది.


- పాల‌ను ఫ్రీజ‌ర్‌లో పెట్టి ఐస్ అయ్యాక ముఖానికి మ‌ర్ధ‌న చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా, అందంగా క‌నిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: