స‌హజంగా ఎవ‌రికైనా తాము అందంగా క‌నిపించాల‌ని, మంచి టోన్ రావాల‌ని, ఎలాంటి మ‌చ్చ‌లు, మొటెమ‌లు రాకుండా ఉండాల‌ని చాలా ప్ర‌యోగాలు చేస్తుంటారు. అయితే మనం తినే ఆహారం మీద కూడా అందం డిపెండ్ అవుతుంది. ఎల్ల‌ప్పుడు మంచి పోష‌క ఆహారం తీసుకోవాలి. పోష‌క ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల ఆర్యోగంతో పాటు అందం కూడా పొంద‌వ‌చ్చు. 


అలాగే మ‌న ఇంటిలో దొరికే ప‌దార్థాల‌తోనే స‌హ‌జ సిద్ధ‌మైన అందాన్ని పొంద‌వ‌చ్చు. అలాగే ఇంటి చిట్కాలు వాడ‌డం వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మ‌రియు టిప్స్ యూజ్ చేస్తే ఎలాంటి మ‌చ్చ‌లు, మొటెమ‌లు లేకుండా కాంతివంత‌మైన అందాన్ని పొంద‌వ‌చ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..


- ముందుగా శెన‌గ‌పిండి తీసుకుని అందులో కొంచెం ప‌సుపు మ‌రియు పాలు క‌లిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై డ‌స్ట్ పోయి కాంతివంతంగా మారుతుంది.


- ట‌మాటాను తీసుకుని స‌గానికి క‌ట్ చేసి ముఖానికి బాగా స్క్రబ్ చేసుకోవాలి. అలా కొంత సేపు చేసిన త‌ర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి టోన్ వ‌స్తుంది.


- ఉల్లిర‌సాన్ని తీసుకుని ఫేస్‌కు మ‌రియు మెడ‌కు అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మ‌చ్చ‌లు, ముడ‌త‌లు తొలిగిపోవ‌డానికి బాగా స‌హాయ‌పడుతుంది.


- నిమ్మ‌ర‌సంలో కొంచెం శెన‌గ‌పిండి మ‌రియు ప‌సుపు క‌లిపి ముఖానికి రాసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉన్న మ‌చ్చ‌లు తొల‌గిస్తుంది.


- తేనెలో కొంచెం నిమ్మ‌రసం క‌లిపి ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల త‌ర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.


- బంగాల‌దుంపలో కొంచెం నిమ్మ‌రసం క‌లిపి మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు అప్లై చేసుకుని కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మంపై మురికిని తొలిగిస్తుంది.


- బొప్పాయి ముక్క‌లు తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను ముఖానికి, మెడ‌కు బాగా రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి క‌ల‌ర్ పొంద‌వ‌చ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: