జుట్టు సౌందర్యం మాట అలా ఉంచితే జుట్టు ముందు ఊడిపోకుండా కాపాడుకోవడం ప్రస్తుత కాలుష్యమయమైన సమాజంలో అదో పెద్ద సవాల్ అనే చెప్పాలి. ముఖ సౌందర్యం బాగానే ఉన్నా శరీరాకృతి అదిరిపోయేలా ఉన్నా, జుట్టు ఊడిపోయి సన్నని పీలికలు కనిపిస్తూ ఉంటే ఎంత అందం ఉన్నా అది సున్నానే అవుతుంది. అందంలో కీలక పాత్ర పోషించే జుట్టు విషయంలో మాత్రం అందరూ అశ్రద్ధ వహిస్తూనే ఉంటారు. జుట్టు దాదాపు ఊడిపోయే వరకూ కూడా జుట్టుపై శ్రద్ద పెట్టరు. అందుకే జుట్టు ఊడిపోయే సమయంలో మాత్రమే కాదు. జుట్టు ఒత్తుగా నాజూకుగా ఉన్నప్పుడు శ్రద్ధ వహిస్తూ తప్పకుండా జుట్టు బలంగా తయారవుతుంది. అయితే ఊడిపోయే జుట్టుకి ఋషులు, పూర్వీకులు ఆచరించే ఓ అద్భుతమైన పద్దతిని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాము.

 Image result for banyan tree uses for hair growth

 మర్రి చెట్టు ఊడలు గురించి అందరికి తెలుసు, మనలో చాలా మంది వాటిని పట్టుకుని ఉయ్యాల ఊగిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అవే మర్రిచెట్టు వేళ్ళు ఊడిపోయే జుట్టుకి బలమైన పట్టుని ఇచ్చి జుట్టు రాలదాన్ని ఆపడంలో, జుట్టుని ధృడంగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరి మర్రిచెట్టు వేళ్ళతో ఎలా జుట్టుని ధృడంగా చేయవచ్చో ఇప్పుడు చూద్దాం..

 Image result for strong hair

 మర్రిచెట్టు వెళ్ళు అంటే ఊడలు కొన్ని తీసుకుని, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి, అలా చేసిన వాటిని  ఎండలో బాగా ఎండబెట్టి మెత్తని పొడిగా చేసుకోవాలి. పొడిగా అయిన తరువాత సుమారు 300 గ్రాములు తీసుకుని అందులో స్వచ్చమైన కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎండలో మళ్ళీ రెండు రోజులు పెట్టాలి. ఇలా చేసిన తరువాత ఆ మిశ్రమాన్ని ఓ పలుచటి గుడ్డలో వడబోసి, వచ్చిన నూనెని రోజు తలపై కుదుళ్ళకి చేరుకునేలా రాసుకోవాలి. ఇలా వారానికి సుమారు రెండు సార్లు చేస్తూ ఉండటం వలన జుట్టు రాలడం ఆగిపోవడమే కాకుండా ఒత్తుగా ఎదుగుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: