స‌హ‌జంగా చాలా మందికి బంగాళ‌దుంప‌ను ఇష్ట‌పడుతుంటారు. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అదే విధంగా అందానికి అంటే మేలు చేస్తుంది. ఆకర్షణీయమైన చర్మ ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు అనుకుంటారు. దీని కోసం వాళ్ల‌కు న‌చ్చిన‌ట్టు అనేక విధాలుగా ప్ర‌య‌త్నిస్తారు. అయితే అటు బంగాళ‌దుంప తిన‌డానికి ఎంత టేస్టీగా ఉంటుందో.. ఇటు సౌంద‌ర్య విష‌యంలో కూడా అంతే బాగా ప‌నిచేస్తుంది. 


బంగాళా దుంపలను ఫేస్ మాస్క్‌లా ముఖానికి వేసుకున్న‌ప్పుడు చర్మానికి సహజ సిద్దమైన గ్లో అందివ్వడమే కాకుండా, మీ చర్మ ఆరోగ్యానికి కూడా ఉండ‌డానికి తోడ్ప‌డుతుంది. బంగాళ‌దుంప చ‌ర్మ ర‌క్ష‌ణ‌కు బాగా ఉప‌యోగ‌పడుతుంది. అవే విధంగా బంగాళా దుంపలలో ఉండే పోషకాలు వ‌ల్ల ఫెయిర్ స్కిన్ ల‌భిస్తుంది. మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- బంగాళ‌దుంప పేస్ట్‌లో కొద్దిగా పెరుగు వేసి మిక్స్ చేసి ముఖానికి మాస్క్ వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మ‌చ్చ‌లు తొలిగిపోయి క్లీన్ అండ్ ఫ్రెష్‌గా క‌నిపిస్తుంది.


- బంగాళ‌దుంప‌ను బాగా పేస్ట్ చేసి అందులో కొంచెం నిమ్మ‌ర‌సం క‌లిపి ముఖానికి అప్లై చేసి కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.


- బంగాళ‌దుంప‌, కీరా, నిమ్మ‌కాయ రాస‌న్ని తీసుకుని అందులో కొంచెం ప‌సుపు క‌లిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఫెయిర్ లుక్ అందిస్తుంది.


- బంగాళ‌దుంప ర‌సంలో కొంచెం తెనె క‌లిపి ముఖానికి మ‌రియు క‌ళ్ల కింద అప్లై చేసుకుని కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకుంటే క‌ళ్ల కింద డార్క్ స‌ర్కిల్స్ తొల‌గిపోతాయి.


- బంగాళ‌దుంప పేస్ట్‌లో కీరా ర‌సాన్ని మిక్స్ చేసి పేస్‌కు అప్లై చేస్తే మొటిమ‌ల‌ను తొలిగించ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.


- బంగాళ‌దుంప పేస్ట్‌లో ముల్తానీ మట్టి మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే ముఖం కాంతివంతంగా మ‌రియు ఆక‌ర్ష‌నీయంగా క‌నిపిస్తుంది.


- బంగాళ‌దుంప ర‌సంలో కొంచెం నిమ్మ‌ర‌సం మ‌రుయి ఎగ్ వైట్ క‌లిపి త‌ల‌కి ప‌ట్టించి కొంత స‌మ‌యం త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వెంట్రుక‌లు బ‌లంగా ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: