కలబందను ఇంగ్లీషులో అలోవేరా అని అంటారు. సాధారణంగా దీనిని గార్డెన్ లో అందంకోసమే పెంచుతుంటారు.కొత్తగా కట్టిన ఇళ్లకూ, భవంతులకూ కూడ దీన్ని దృష్టి దోష నివారణకోసం కడుతుంటారు. ఒక చిన్న మొక్కను తెచ్చి పెరట్లో నాటి అప్పుడప్పుడు కొంచెం నీళ్లు పోస్తుంటే చాలు ఈ మొక్క ఎన్నో సంవత్సరాలు పెరుగుతూనే ఉంటుంది. వేర్ల నుంచే మళ్లీ దీనికి మొక్కలు వస్తాయి.  కలబంద రసం వాడటం వలన కలిగే ప్రయోజానాలు అందరికి తెలిసినవే. కలబంద రసం వలన కలిగే ప్రయోజనాలు ఇప్పటికే చాలా మందికి తెలుసు.కలబందలో ఉండే పోషకాలు, శరీరంలో ప్రమాదాలను మరమ్మత్తులను చేస్తాయి. మన శరీరం అస్వస్తతకు గురైనప్పుడు నయం చేయటానికి కావాల్సిన పోషకాలు కలబంద రసంలో ఉంటాయి.


బరువు తగ్గటానికి మరియు షుగర్ వ్యాదుల నివారణకు ఇంకా చాలా మందుల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు. కలబంద అధిక మొత్తంలో విటమిన్ మరియు మినరల్ లను కలిగి ఉంటుంది. విటమిన్ 'A', 'C', 'E', 'B1', 'B2', 'B3', 'B6', ఫోలిక్ యాసిడ్ మరియు కోలీన్ వంటి ముఖ్యమైన విటమిన్ లన్నిటిని కలిగి ఉంటుంది. విటమిన్ 'B12' కలిగి ఉండే కొన్ని మొక్కలలో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి మినరల్ లను కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది.అలోవేర(కలబంద) ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా గొప్పగా సహాయపడుతుంది. అనేక చర్మ సంబంధిత సమస్యలకు వాడే వివిధ రకాల ఔషధాలలో అలోవేరాను ఉపయోగిస్తారు అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడంలో అలోవెరాలోని ఔషద గుణాలు చురుగ్గా పనిచేస్తాయి. చర్మాన్ని మిలమిల మెరిపించి, వయసు తగ్గించి చూపే కలబంద అందానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మృతకణాలను తొలగిస్తాయి. కలబందలో ఫాలీ సచార్డిన్స్, లెక్టిన్స్, మన్నన్ కాంపౌండ్స్ వంటి లక్షణాలుంటాయి. ఇవి చర్మంలోతుల్లోకి చొచ్చుకెళ్లి మృతకణాలను తొలగిస్తాయి.బాదం నూనెలో అలోవెరా జెల్ కలిపి రాత్రి పడుకునే ముందు చర్మానికి అప్లె చేసుకుని పడుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా క్రమంగా చేస్తే ముడతలు పడిన చర్మం తిరిగి జీవం పోసుకుంటుంది.ఫ్రెష్ గా ఉండే అలోవెర జెల్ ఒక బెస్ట్ హోం రెమెడీ . దీన్ని చుండ్రు నివారణకు ఉపయోగించుకోవచ్చు . అలోవెరాలోని థెరఫియాటిక్ లక్షణాలు చుండ్రును వదిలించడంలో కొన్ని అద్భుతాలను క్రియేట్ చేస్తుంది . అలోవెర నుండి జెల్ ను వేరు చేసి తల, స్కాల్ఫ్ మొత్తానికి అప్లై చేయాలి . రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేయాలి


ఒక టేబుల్‌స్పూన్ బత్తాయి తొక్కల పొడిలో, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంలో టేబుల్‌స్పూన్ కలబంద గుజ్జు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖం కడుక్కున్న తరువాత ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తెల్లబడుతుంది.కలబందను చిన్న ముక్కగా కట్ చేసి రెండు భాగాలుగా ఛీల్చి మధ్యలో ఉన్న గుజ్జును ముఖానికి సున్నితంగా రుద్దుకోవాలి.ఇలా రుద్దుకున్నాక 15 నుంచి 20 నిమిషాల ఉంచుకుని తర్వాత గోరు వెచ్చటి నీటీతో ముఖాన్ని కడుక్కోవాలి. కడిగిన తరువాత ఒక గంట సేపటి వరుకు ఎటువంటి సబ్బుతో ముఖాన్ని రుద్దకూడదు.ఈ విదంగా వారానికి 2,3 సార్లు చేస్తే ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: