ముఖం పట్టులా మెరవడానికి, సున్నితంగా ఉండటానికి రకరకాల ఫేస్ ప్యాక్స్ వాడుతూ ఉంటాం. ఎన్నో రకాల పద్దతులని పాటిస్తూఉంటాం. అయితే తాజా పళ్ళతో మాస్క్ లో చాలా మంది ప్రయత్నించరు, ఎందుకంటే ఎలాంటి ప్రభావం చర్మంపై పడుతుందోననే భయం చాలా మందిలో ఉండటమే, అదే సమయంలో అవగాహన లేకపోవడమే. అయితే అరటి పండుతో నిర్భయంగా ఫేస్ ప్యాక్ ని తయారు చేసుకుని ఎవరైనా సరే వాడుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ –ఏ  పొడిబారిన చర్మాన్ని తిరిగి పొందేలా చేస్తుంది. ముడతలు పడిన చర్మాన్ని తిరిగి యదాస్థానానికి తీసుకువస్తుంది. మరి అరటిపండు ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం..

 Image result for banana honey face mask

సహజంగా చెట్టుమీద పండిన ఓ అరటిపండు తీసుకుని, పై తొక్కని తీసేసి, పండుని మిక్సీ లో వేసి మెత్తగా చేసుకోవాలి. ఒక బౌల్ లోకి ఆ గుజ్జుని తీసుకుని. ఒక స్పూన్ అరటి పండు గుజ్జులో, స్పూన్ స్వచ్చమైన తేనే కలిపి రెండిటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి పదినిమిషాలు ఆరనివ్వాలి.  ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖం తేమగా, పట్టులా ఉంటుంది.  అంతేకాదు

 Image result for banana honey face mask

ముఖంపై ఏర్పడిన మొటిమలు, మచ్చలు పోగొట్టడంలో అరటిపండు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు చర్మంపై తేమని కలిగించడంలో తేనే కీలక పాత్ర పోషిస్తుంది. తేనే, అరటి పండు లో ఉండే గుణాలు చర్మంపై ముడతలు పడకుండా చేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: