ప్ర‌తి సీజ‌న్‌లోనే దొరికే అర‌టిపండు వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అన్ని కాలాల్లో లభించటమే గాక త‌క్కువ ధ‌ర‌కి లభించే పండు అరటి. ఇందులో ఎ,బి,సి,ఇ విటమిన్లు, మినరల్స్‌, పొటాషియం, జింక్‌, ఐరన్‌ మాంగనీస్‌ పుష్కలంగా లభిస్తాయి. అర‌టి పండు సులువుగా జీర్ణం అవుతుంది. రోజు ఒక అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిది. 


అదే అరటి మంచి సౌందర్యసాధనం కూడా. ఎప్పుడూ అందుబాటులో ఉండే అరటిపండుతో ఫేషియల్‌ ముఖానికి ఎంతో కాంతినిస్తుంది. అరటిపండులో మాయిశ్చర్‌ అధికం. అలాగే అర‌టిపండుతో చాలా ర‌కాల సౌంద‌ర్య చిట్కాలు ఉన్నాయి. మ‌రి అవేంటో ఓ లుక్కేయండి..


-  అరటి గుజ్జును కంటి చుట్టూ రాసుకుని 20 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై ముడతలు తగ్గిపోతాయి.


- అరటి పండు గుజ్జుకి చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే పొడిభారిన చర్మం కాంతివంతంగా మ‌రియు అందంగా సంతరించుకుంటుంది.


- అరటి గుజ్జులో ఓ స్పూన్‌ శనగపిండి మ‌రియు పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే, మృత కణాలు పోయి ముఖం తాజాగా ఉంటుంది.


- బాగా పండిన అరటిపండు తీసుకుని గుజ్జు చేసి ముఖానికి, మెడకు రాసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకుంటే  ముఖానికి చక్కటి మాయశ్చరైజర్‌లాగా ఉపయోగపడుతుంది. 


- అరటి గుజ్జులో  నిమ్మరసం, పెరుగు కలిపి  ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖానికి ఉన్న మురికి సులువుగా తొల‌గిపోతుంది.


- ముఖంపై మొటిమ‌లు ఉన్న‌వారికి అర‌టి తొక్క‌లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అర‌టి తొక్క‌ల‌ను ముఖంపై బాగా మ‌ర్ద‌న చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు తొల‌గిపోతాయి.


- అరటి తొక్క గుజ్జుకు గుడ్డుసొన కలిపి మిక్స్ చేసుకుని ముఖమంతా అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం అందంగా మ‌రియు కాంతివంతంగా మారుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: